వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బాబు మోహన్

నవతెలంగాణ – హైదరాబాద్:  ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే అంతకు ముందు ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తాను అనార్యోగంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఆయన పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

Spread the love