Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నియామకం

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నియామకం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు,రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచన మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను వేసినట్లుగా తెలిపారు.ఇప్పలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడుగా అబ్బినేని లింగస్వామి,కొండంపేట గ్రామశాఖ అధ్యక్షుడుగా శనిగరం రాజయ్య లను ఏకగ్రీవంగా నియమించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందేలా చూడాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బడితెల రాజయ్య,సర్పంచ్ల  పొరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడారి చిన మల్లయ్య,పోటు ప్రభాకర్ రెడ్డి,కుంభం ముకుందరెడ్డి,చల్లా మల్లారెడ్డి,యూత్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -