ఆర్మీ అగ్నివీర్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

నవతెలంగాణ – ఢిల్లీ: ‘అగ్నిపథ్’లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17 నుంచి 26వరకు షిఫ్ట్‌ల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు విడుదల చేశారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించిన అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే పలు జోన్‌ల ఫలితాలు వెల్లడించిన అధికారులు.. ఆదివారం ఏఆర్‌వో చెన్నై జోన్‌ ఫలితాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు తమ వివరాలను చెన్నై జోన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Spread the love