రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– పశుసంవర్దకశాఖ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల ని పశుసంవర్దక శాఖ అధికారులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశించ్చారు. ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో గొర్రెల పంపిణీపై పశుసంవర్థక శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా డెబై ఐదు వేల రూపాయలతో 20గొర్రెలు ఒక పొట్టెలు గొర్రెల పెంపకం దారులకు అందజేయనున్నట్టు తెలిపారు. తెలం గాణ ప్రభుత్వ రూ.1,31,250 సబ్సిడీగా అందజేస్తుందని వివరించారు. లబ్దిదా రులు తమ వాటాగా రూ.43,750 చెల్లించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ఎడీ స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గొర్రెలను కొని లబ్దిదారులకు నేరుగా అందజేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కురుమ, యాదవ గొర్రెలు, మేకల పెంపకందారులకు పదివేల కుటుం బాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని చెప్పారు. మొదటి విడతలో 2,445 యూనిట్లు లబ్ధిదారులు తీసుకున్నారని, రెండవ విడతలో మిగిలిన 7,674 కుటుంబాలకు గొర్రెలు దశలవారిగా అందించే విధంగా ఏర్పాట్లు చేసి నట్టు వివరించారు. దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్‌ ఈ క్యాక్రమా న్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకటరమణగారెడ్డి, పశుసంవర్దక శాఖ ఏడీ వసంతకుమారి, డా. సురేందర్‌, సురేష్‌ బాబు, కిరణ్‌, నర్సింహ్మారావు, శాఖ వైద్యులు డా. రేఖ, నాగమణి, సుధ పాల్గొన్నారు

Spread the love