చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్

నవతెలంగాణ – హైదరాబాద్: చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని.. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. అసదుద్దీన్. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని చెప్పిన అసదుద్దీన్ చంద్రబాబును మాత్రం నమ్మలేమన్నారు.  ప్రజలు కూడా చంద్రబాబు ని ఎప్పుడూ నమ్మకండని కోరారు.. అటు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసిరారు.

Spread the love