జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటును శనివారం నాడు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ప్రారంభోత్సవంలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ తాసిల్దార్ కార్యాలయ అధికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.