ఢీల్లీలో దారుణం.. బాలికను కత్తితో పొడిచి హత్య..

నవతెలంగాణ – ఢీల్లీ: దేశ రాజధాని ఢీల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగని ఆ మానవ మృగం.. పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ.. అక్కడ ఉన్న ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఢీల్లీ రోహిణి ప్రాంతంలోని షహబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఓ యువకుడితో స్నేహంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆదివారం సాయంత్రం ఓ స్నేహితురాలి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు ఆ బాలిక బయలుదేరింది. ఇదే సమయంలో ఆమె వెంట వెళ్లిన ఆ యువకుడు.. బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. వీధిలో జరుగుతున్న ఈ దారుణాన్ని పలువురు చూసుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఎవ్వరూ అతడిని నిలువరించడానికి ప్రయత్నించలేదు.

Spread the love