2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రయోగం
రాష్ట్రంలోనూ
లబ్ది పొందేందుకు వ్యూహాలు
అర్హులైన ప్రతి పౌరుడి ఓటును రక్షించాలి
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది
రాష్ట్రాలకు తీవ్ర నష్టం : సీపీఐ(ఎం)
పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
చౌటుప్పల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)ను ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియగా కాకుండా, రాబోయే 2029 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వినియోగించుకుం టోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కునూ పరిరక్షించాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే రాజకీయ ప్రయత్నాల కోసం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో చివరిసారిగా 2002లో సమగ్ర సవరణ జరిగిందని చెప్పారు. పదేండ్లకోసారి జరగాల్సిన ప్రక్రియను ఆలస్యంగా ఇప్పుడు చేపట్టడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
బీజేపీకి పడని ఓట్లే లక్ష్యంగా..
ముస్లిములు, ఇతర మైనారిటీలు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వెనుకబడిన తరగతుల నుంచి తమకు పడని ఓట్ల తొలగింపే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం సర్‌ను ఉపయోగించుకుంటోందని రాఘవులు విమర్శించారు. అత్యల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన నియోజక వర్గాలను గుర్తించి, అక్కడ ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చనేది బీజేపీ అసలు లక్ష్యమన్నారు. గతంలో బీహార్, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో అమలు చేసి బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఆ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. బీహార్, అసోం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలను ఉదహరిస్తూ అర్హులైన అనేక మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని తెలిపారు. ఒక్క బెంగాల్‌లోనే కోటి ఓట్లను తొలగించారని… న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాక 70 లక్షల మంది ఓట్లు తిరిగి చేర్చారని చెప్పారు. 30 లక్షల మంది ఓటుహక్కును కోల్పోయారని వివరించారు. సర్‌పై అన్ని రాజకీయ పార్టీలూ అప్రమత్తం కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందన్నారు. ప్రతి ఓటరూ తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ఎక్కడైనా తొలగింపు లేదా లోపాలు కనిపిస్తే వెంటనే అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.
డీలిమిటేషన్ రాజకీయ ఎత్తుగడ
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను కూడా ఎన్నికల లబ్దికి అనుకూలంగా వినియోగించే ప్రయత్నం జరుగుతోందని రాఘవులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్
బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు సర్‌పై సరైన శిక్షణను ఇవ్వలేదని, కలెక్టర్ ఈ అంశాన్ని పరిశీలించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ కోరారు. ఎంతోమంది కార్మికులు వలసపోయారని, నేటికీ వేల మంది దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇవ్వలేదని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా అధ్యక్షత వహించిన ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విమర్శలు మాని.. సాగునీటిపై దృష్టి సారించాలి: అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు రాఘవులు విజ్ఞప్తి
రాష్ట్రంలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ విమర్శలు, ప్రత్యారోపణలను పక్కనబెట్టి రైతులకు సాగునీరందించే చర్యలపై ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాలు దృష్టి సారించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకోవడం కంటే రైతులకు నీరెలా అందించాలనే అంశంపై చర్చ జరపాలని సూచించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యల్లో మూఢనమ్మకాలను ప్రోత్సహించే ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీలు శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించే అవకాశం ఉంటే ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని ఆయన అన్నారు. ఇప్పటికీ దాదాపు 30 శాతం మందికి దరఖాస్తు ఫారాలు అందలేదని, ఫారాలు సమర్పించిన వారిలో కూడా ఆధార్ కార్డు, తల్లిదండ్రుల వివరాలు తదితర కారణాలు చూపుతూ పెద్దఎత్తున తిరస్కరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల కమిషన్ దే బాధ్యత
సర్‌లో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా చురుగ్గా పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించడం చూస్తేనే ప్రక్రియలో ఉన్న లోపాలు స్పష్టమవుతున్నాయని రాఘవులు అన్నారు. ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను విని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్పులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాచారం సేకరించి ఎన్నికల కమిషన్‌కు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క అర్హత ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడటం ఎన్నికల కమిషన్ బాధ్యత అన్నారు.
సర్‌తో ప్రజాస్వామ్యంపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



