క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

Attacks on Christians should be stopped– పాస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్యానంద్‌
– ఆమనగల్‌లో క్రైస్తవుల నిరసన ర్యాలీ
– తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-ఆమనగల్‌
మణిపూర్‌ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గురువారం ఆమనగల్‌ పట్టణంలో క్రైస్తవ సోదరులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్యానంద్‌తో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజల హక్కులను భంగం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో భారత మాతను పూజించే వాళ్ళు మహిళలను ఎందుకు పూజించలేక పోతున్నారని, గోమాతను తల్లిగా భావించేవారు మహిళలపై ఎందుకు దాడులకు పాల్పడుతున్నారని వారు ప్రశ్నించారు. అనంతరం క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు శ్రీశైలం, కార్యదర్శి ఆనంద్‌, ప్రధాన కార్యదర్శి సఫియా బేగం, ఆయా సంఘాల పాస్టర్లు కిషోర్‌, కుమార్‌, జాన్‌, రాజ్‌, ప్రసాద్‌, జాన్సన్‌, ప్రేమ్‌ రాజ్‌, అమ్మాస్‌, ప్రకాష్‌, సైదులు, రాకేష్‌, సత్యరాజ్‌, రాజానంద్‌ ప్రేమ్‌ కుమార్‌, విద్యాసాగర్‌, కష్ణయ్య, లక్ష్మణ్‌ నాయక్‌, జీవరత్నం పాల్గొన్నారు.

Spread the love