– పోలీసు సేవలు అభినందనీయం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ నుంచి మేనూర్ మార్గంలో ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న పోలీసు వాహనం ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించిన ఎస్సై విజయ్ కొండ గాయాలైన వారికి పోలీసు వాహనంలో ఎక్కించి మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలై ఇబ్బంది పడుతున్న సమయంలో పోలీసులు వచ్చి వారి వాహనంలో ఆస్పత్రికి తరలించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ్ కొండ పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు అభినందించారు.