రేఖకి డాక్టరేట్  ప్రదానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో కె. రేఖకి మంగళవారం జరిగిన వైవా-వోస్ కార్యక్రమంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ ఎం. మమత పర్యవేక్షణలో రేఖ “స్టడీస్ ఆన్ ఆర్బస్క్యూలర్ మైకోరైజల్ ఫంగి అండ్ యాంటిమైక్రోబియల్ యాక్టివిటీ  ఆఫ్ కెథరాంథస్ రోజియస్ ఎట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ” అనే అంశం పై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ వర్సిటీ కు సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ కి చెందిన ప్రొఫెసర్ కె. శైలజ ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. కాగా రేఖ తన పరిశోధనలో మైకోరైజల్ శీలింద్రాలు బిళ్ళగన్నేరు మొక్క పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతాయని, ఈ మొక్క మంచి ఔషధ విలువలను, సూక్ష్మజీవులను చంపే గుణాన్ని కలిగి ఉన్నట్టు తన పరిశోధనలో తేలిందని తన పరిశోధన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరిషోదక విద్యార్థిని రేఖ పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఆమెకు డాక్టరేట్ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  తెయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి, అభినందించగా  సైన్స్ డీన్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్. ఆరతి, వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎమ్. అరుణ, బివోఎస్ ప్రొఫెసర్ విద్యావర్ధిని,  డా. ఎ. ఎ. హలీమ్ ఖాన్, డా. దేవరాజు శ్రీనివాస్, డా. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love