రైతు వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించండి..

– ఇండియా కూటమి అభ్యర్థులను బలపరచండి..
– ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య 
నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతు వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వన్ని  ఓడించి,ఇండియా కూటమి అభ్యర్థులను బలపరచి భారీ మెజార్టీ తో విజయం సాధించే విధంగా చూడాలని  ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కేంద్రంలోని  బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళ కాలంలో భారత వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని,రైతులకు గిట్టుబాటు ధరలు రాలేక కనీసం మద్దతు ధరలు సైతం రైతులు పొందలేక పోయారని అన్నారు. వీరి పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడిందని, వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతు మెడకు ఉరి తాడు పరిగించి ఎందరో రైతులు ఉసురు తిసిందన్నారు. లక్షలాది మంది రైతులు 14 నెలల కాలం నుండి మూడు చట్టాల రద్దు కై సుదీర్ఘమైనా పోరాటం వల్ల మోడీ ప్రభుత్వం దిగి వచ్చి చట్టాలను వేనుకకు తీసుకుందని వివరించారు. ఈ ఉద్యమం లో 750 మంది రైతులు మరణించారని అవేదన వ్యక్తం చేశారు. రైతుఉద్యమానికి రాతపూర్వక ఇచ్చిన హామీలను అమలు చేయలేక  మోసం చేసిందని విమర్శించారు.ఎంఎస్ పి మద్దతూ ధరల చట్టాన్ని తీసుకరావడం లో ఘోరం గా విఫలం అయిందన్నారు. రైతు పంటలకు ధరలు రాక, పంటకు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతు అప్పుల సుడిగుండంలో చిక్కుకొని ఆత్మ హత్యల పాలయ్యారని పేర్కొన్నారు. పచ్చని పంట భూములనుండి రైతును, బేధాకల్ చేసి అట్టి భూములను పరిశ్రమిక వేత్తలను ఆధాని, అంబానిలకు కట్టాబేడుతున్నారని, రైతును రోడ్లపై నిలబెడుతున్నారని భూమయ్య అన్నారు. అందుకు గాను బిజెపి ప్రభుత్వని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను బలపరచండని భూమయ్య కోరారు. ఈ కార్యక్రమం లో ఎఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షలు దేవస్వామి, పివైఎల్ ఉపాధ్యక్షులు సాయినాథ్, జిల్లా నాయకులు దాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love