సహ చట్టంపై విద్యార్థులకు అవగాహన

Awareness of students on co-lawనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, పట్టణ కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహ చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం మాట్లాడుతూ సహ చట్టం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హారిక, న్యాయవాదులు శ్రీనివాసరావు, డి సతీష్ కుమార్, సహ చట్ట పరిరక్షణ కమిటీ మండల మహిళ కార్యదర్శి ఎస్ నవనీత, పాఠశాల, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Spread the love