Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన

పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం లోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం భరోసా టీం, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చైల్డ్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాలు) వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలను తెలియజేస్తూ, అటువంటి సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి సున్నితంగా వివరిస్తూ, అనుచిత ప్రవర్తనను గుర్తించి ధైర్యంగా చెప్పే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ఉద్దేశ్యాన్ని వివరించారు. తప్పిపోయిన, నిరాశ్రయ స్థితిలో ఉన్న లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విద్యార్థులకు తెలియజేశారు. కాటారం ఎస్ ఐ మాట్లాడుతూ.. చిన్నారుల భద్రతలో ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా బాలలపై అన్యాయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా భరోసా కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు పలు సందేహాలు అడిగి తెలుసుకోవడంతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్‌పై మరింత అవగాహన పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -