ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అవగాహన: డాక్టర్ ప్రమోదిత..

నవతెలంగాణ – రెంజల్ 

బీడీలు, సిగరెట్లు, జర్దా, గుట్కా పొగాకు ఉత్పత్తుల ద్వారా తయారయ్యే వాటిని త్రాగడం, నమలడం, పీల్చడం ద్వారా అనేక అనారోగ్య కారణాలకు గురవుతారని, డాక్టర్ ప్రమోదిత, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్ లు స్పష్టం చేశారు. శుక్రవారం ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని, రెంజల్ మండలంలోని ప్రతి సబ్ సెంటర్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, పొగాకు వాడడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, రక్తనాళాలు దెబ్బతినీ గుండె సమస్యలు, చర్మవ్యాధులు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బాలలు, యువత, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నీకోటిన్ లాంటివి పీల్చడం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇప్పటినుంచైనా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈ ఇ,గబ్బర్ సింగ్, గ్రామ కార్యదర్శులు శివకృష్ణ, రాజు, వెంకటరమణ, ఆరోగ్య కార్యకర్తలు భాగ్యమ్మ, విజయ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Spread the love