మలేరియా దోమల నివారణపై అవగాహన ర్యాలీ

నవతెలంగాణ – రెంజల్

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మలేరియా దోమల నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో నోడల్ అధికారి కరిపే రవీందర్ అధ్యక్షతన ఆరోగ్య సిబ్బంది, ఆశలు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల భారీ నుంచి అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే గా తప్పనిసరిగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. తప్పనిసరి గా దోమతెరలు వాడాలని, జ్వరాలు వచ్చిన వారు తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సరిస్థాపిర్దోస్ సూచించారు. అనపిలిస్ దోమ ద్వారానే మలేరియా సోపుతోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, పీహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్ మాలంబి, ఎం ఎల్ హెచ్ పి లు ప్రమోదిత, ఉజ్మ, ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Spread the love