ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి

– కేస్ పల్లి లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
నవతెలంగాణ -జక్రాన్ పల్లి : ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని ఆయుర్వేద వైద్యురాలు లలిత మంగళవారం అన్నారు. మండలంలోని  కేశ్ పల్లి గ్రామంలో గ్రామపంచాయతీలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పడకల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్యురాలు లలిత తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారాలు మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు, రక్త పోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీల రుతుక్రమానికి సంబంధించిన వ్యాధులకు, చర్మ రోగాలకు, అజీర్ణ, పక్షవాతం, జ్వరాలకు, దగ్గు, జలుబు వంటి రోగాలకు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని వివరించారు. రోగులకు చికిత్స చేసి మందులు ఉచితంగా అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైదాం మహేశ్వర్, ఎంపిటిసి గంగాధర్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఫార్మసిస్టు వరలక్ష్మి, ఏఎన్ఎం సుజాత, ఎస్ ఎన్ ఓ మహేందర్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love