- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF) ప్రతిప్రతినిధి, హక్కుల నాయకుడు గాదె ఇన్నయ్యకు కోర్టులో భారీ ఊరట లభించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నమోదు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన 2 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆయన చంచల్‌గూడ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు. గత కొంతకాలంగా ఎన్‌ఐఏ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న గాదె ఇన్నయ్య.. తన వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆయనకు 2 నెలల పాటు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -



