Friday, June 5, 2026
E-PAPER
Homeనల్లగొండసాగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా బండ శ్రీధర్ రెడ్డి

సాగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా బండ శ్రీధర్ రెడ్డి

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా,నాగార్జున సాగర్ నియోజకవర్గ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా.. పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన జీ న్యూస్ తెలుగు రిపోర్టర్ బండ శ్రీధర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈనెల 3న నకిరేకల్ పట్టణంలో టియుడబ్ల్యూజే ఐజేయు సంఘం మహాసభ నిర్వహించారు. ఈ మహా సభలో ఏంపిక చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సమక్షంలో నూతన కమిటీలు ఏర్పాటు చేశారు .ఈసందర్బంగా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరి సలహాలు,సూచనల ప్రకారం
యూనియన్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అలాగే అర్హులు లైన జర్నలిస్ట్ ల అందరికి అక్రిడేషన్ కార్డులు వచ్చేలా సూస్తామని అన్నారు. అనంతరం ఉపాధ్యక్షుడు ఎడవెల్లి శంకర్,ప్రధాన కార్యదర్శి వనమాల కోటయ్య,కార్యదర్శిగా చందా రవీందర్ రెడ్డి, కోశాధికారిగా దారెడ్డి వెంకటరెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -