
మంగళవారం రోజున మోపాల్ మండలంలోని స్థానిక ప్రెసిడెంట్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆల్ పెన్షన్ అసోసియేషన్ మరియు మల్లు స్వరాజ్యం ఆధ్వర్యంలో బాలోత్సవం చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవం కార్యక్రమం వల్ల విద్యార్థులకు సమాజ మార్పునకు వివిధ రుక్మాతలను పాల దోలడానికి మంచి నడవడిక నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే చదువుతోపాటు క్రీడారంగం, సంస్కృతిక రంగం, విద్యార్థి దశలో పిల్లలకు దీనిపైన ఆసక్తి ఉంటే దాన్ని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు గుర్తించి వాటి పైన ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అలాగే బాలోత్సవం కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తే అక్కడ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని విద్యార్థి దశలోనే అన్ని నైపుణ్యాలు నేర్చుకోవచ్చని ఇది చక్కటి కార్యక్రమం అని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆల్ పెన్షనిర్స్, జనవిజ్ఞాన వేదిక ,మల్లీ స్వరాజ్యం ట్రస్ట్ అలాగే ప్రెసిడెంట్ పాఠశాలకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తుందని దానికి ఉదాహరణంగా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుందని విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు అని దాన్ని కచ్చితంగా వినియోగించుకోవాలని అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అనేక విద్యార్థులకు నైపుణ్య రంగంలో శిక్షణ ఇస్తుందని అలాగే స్పోర్ట్స్ పైన కూడా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని ఆయన అన్నారు.
చదివంటే కేవలం మార్కులే కాదని చదవండి ఒక నైపుణ్యమని రెండు కళ్ళతో మనిషి ప్రపంచాన్ని చూడాలంటే చదివు ఎంతగానో ఉపయోగపడుతుందని బాల్యంలోనే సమాజం పైన మంచి దృక్పధం ఏర్పరచుకోవాలని మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆయన తెలిపారు . అలాగే విద్యార్థులు చేసిన నృత్యం పాడిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో కవ్వించాయి. అలాగే ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ బాలోత్సవం లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు నర్ర రామారావు, రామ్మోహన్ రావు, జేనీ నెహ్రూను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ ని దూరం చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని మొక్కల నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని ఆమె తెలిపారు అక్కడ పెట్టిన స్టాల్స్ ను ఆమె ప్రతి ఒక్కటి పరిశీలించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్క పిల్లలు ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు వారు వ్యక్తం చేసిన భావజాలాన్ని, వారి నైపుణ్యాన్ని చూసి సంతోషపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వచ్చిన సందర్శకులకు ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేసింది ఇంత చిన్న వయసులోనే వారి ఇన్నోవేటివ్ నైపుణ్యాన్ని గుర్తించి నందుకు సంబంధించిన పాఠశాల ఉపాధ్యాయులకు వారు ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఎస్సే రైటింగ్, బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్, సైన్స్ ఫెయిర్ , సిపిఆర్ సిస్టం, దానితోపాటు వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం చక్కటి దస్తూరి, క్విజ్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు నర్రా రామారావు, జయనీ నెహ్రు, రవీంద్రనాథ్ సూరి, కోయేడి నరసింహులు, పవన్ కుమార్, అద్దంకి హుస్సేన్, మదనమోహన్ తదితరులు పాల్గొన్నారు.