బత్తాయిగాళ్ల బడాయి!

లేనిది ఉన్నట్టు, ఉన్నది కాస్తా ఎక్కువగా చెప్పేటోళ్లు అక్కడక్కడ మనకు తారసపడుతుంటారు. వీడు వీడి బడాయి మాటలు అని అంటుంటారు. అటువంటి మాటలు విని నవ్వుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. తాజాగా ఇలాంటి బడాయిగాళ్లు వాట్సాఫ్‌, పేస్‌బుక్‌, ఇన్‌స్టాలో కొకొల్లాలుగా కనిపిస్తున్నారు. ఏమీ లేకపోయినా, ఎంతో జరిగిపోయినట్టు పోస్టులు పైచికానందం పొందుతున్నారు. ప్రజల మెదళ్లను కరాబ్‌ చేస్తున్నారు బతాయిగాళ్లు.అందుకే వారిని బడాయి బత్తాయిగాళ్లు అనక ఇంకేమంటారు. అమెరికా పార్లమెంటులో ఆదేశపు ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అది చూసి బైడెన్‌ కూడా విస్మయానికి గురయ్యారంటూ ఓ ఫోటో చూపించి బతాయిగాళ్లు ఆకాశానికెత్తుతున్నారు. అంతేకాదు, ఆయన ప్రపంచ నాయకుడు అయిపోయాడంటూ వాట్సాఫ్‌ల్లో ఒక్కటే పార్వర్డ్‌ చేస్తున్నారు. ప్రపంచానికి ఓ దిక్సూచి మోడీ అంటూ చెబుతుంటే, అబ్బా వినలేక పోతున్నరా బాబూ… అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. వాటిపై కూడా బత్తాయిలు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ క్రమంలో మోడీ రాకను వ్యతిరేకిస్తూ…అమెరికాలో జనం రోడ్లపైకి వచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ఆందోళన చెందారు. అక్కడ ఓ జర్నలిస్టు మాట్లాడుతూ ’23 ఏండ్లలో మోడీ ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌ మాట్లాడలే. జవాబుదారీతనం అనేది లేదు. గతంలో గుజరాత్‌లో ఘర్షణలు జరిగితే ఆయన స్పందించలేదు. మణిపూర్‌లో మరణహోమం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అదే ఓ సినిమా తీసిన వ్యక్తికి చిన్న ఇబ్బందైతే ఏకంగా ట్వీట్‌ చేసిండు. మా పూర్వీకులు స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఈ విధంగా లేదు’ అని ఆవేదన చెందారు. ఇది మాత్రం ఎక్కడా వైరల్‌ కాదు. ఇది మన దేశ దుస్థితి.
-గుడిగ రఘు

Spread the love