Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ డిక్లరేషన్‌‌లో రజకులకు

బీసీ డిక్లరేషన్‌‌లో రజకులకు

- Advertisement -


వృత్తిదారులకు రూ.10 లక్షల సాయం ఏమాయే?
దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలి:
రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి పైళ్ల ఆశయ్య
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
నవతెలంగాణ- వంగూరు

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌లో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి వృత్తిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ఏరియా రజక వృత్తిదారుల జనరల్ బాడీ సమావేశం మేకల కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రజక వత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి వృత్తిదారుడికి రూ.10లక్షల ఆర్థిక సహకారం అందిస్తామని, మోడ్రన్ దోబీఘట్ల నిర్మాణం కోసం ప్రతి జిల్లాకు రూ.10కోట్ల నిధులు ఇస్తామని, ప్రతి ఏటా బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని డిక్లరేషన్‌‌లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. దీంతోపాటు ఎంబీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఎంబీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో పోరాడి సాధించుకున్న లాండ్రి వర్కర్స్ షాపులకు ఉచిత విద్యుత్ పథకం బకాయిలను ఈ ప్రభుత్వ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యుత్ అధికారుల వేధింపులు అరికట్టాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మోడరన్ దోబీఘట్లు నిర్మించాలని, రజకులపై జరిగే దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు జూపల్లి జగ్గయ్య మాట్లాడుతూ ఈ నెల 20న గ్రామ గ్రామాన రజకుల సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. సామాజిక సర్వేకు రజకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, కోనేటిపురం శ్రీనివాస్, భోగరాజు శ్రీనివాస్, కొలుకలపల్లి లింగమయ్య, గోకారి, జి లింగమయ్య, మడేల్, రంగయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -