Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్

- Advertisement -

ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 
ముందస్తు కార్యాచరణ :
ఇల్లందు విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపనలో
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఇల్లందు

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకూ విస్తరించిన గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్, బోర్ బావులు, పంపుసెట్లు, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఆదివారం ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలో పర్యటించారు. తొలుత జిల్లా పర్యటనకు విచ్చేసిన భట్టి విక్రమార్కకు కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇల్లందు మండలం పాత రొంపేడు గ్రామంలో నూతనంగా రూ.3కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు.
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ విద్యుత్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నట్టు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) చైర్మెన్‌, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రామదాస్ నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -