నూతన ఆలోచనలతో మంచి వ్యవస్థాపకులుగా మారాలి..

Become good entrepreneurs with new ideas..– ఈవెంట్ మ్యనెజ్మెంట్ లో భాగంగా టీయూలో గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్ కార్యక్రమం..

– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణయూనివర్సిటీ,మ్యనేజ్మెంట్ డిపార్ట్మెంట్ విద్యార్థులు గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహం తో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పాల్గొని మాట్లాడుతు, విద్యార్ధులు ఎంటర్ప్రీనియోర్షిప్ స్కిల్స్ పంచుకోవాలి, భవిష్యత్తులో మీరందరు నూతన ఆలోచనలతోటి మంచి వ్యవస్థాపకులు గా మారాలని కోరారు.గౌరవ అతిథులుగా  ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరతి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహం తో పాల్గొనడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ,వ్యాపార మెలుకువలు ఇంకా నేర్చుకోవాలని సూచించారు. తమ తమ రంగంలో విజయం సాధించిన ఔత్సాహిక వ్యవస్థాపకులు ,  శిల్పి ధర్మేంద్ర కిరణ్ , ఆటో మొబైల్ రంగ నిపుణుడు ఆరుగొండ రవి , ఆహార ఉత్పాదనలు నిపుణుడు మోహన్ పాల్గొని వారి వ్యాపార అనుభవాలను పంచుకున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్, విభాగ అధిపతి ప్రొఫెసర్ ఆంజనేయులు కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ,బిజినెస్ క్విజ్ లో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వాణి , రాజేశ్వరి వ్యవహరించారు. బిజినెస్ ప్లాన్ పోటీలకు ప్రొఫెసర్ అపర్ణ , కైసర్  వ్యవహరించారు.కార్యక్రమం లో డాక్టర్ కిరణ్ రాథోడ్ , డాక్టర్ అలోక్, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love