- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మాధవ్ ఇప్పర్గా సర్పంచ్ బాచావార్ లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం డోంగ్లి మండల కేంద్రంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు యనబోరా, గ్రామ సర్పంచ్ యూనుస్ పటేల్ శాలువలతో ఘనంగా సత్కరించారు. వీరితోపాటు ఆయా గ్రామాల సర్పంచులు కూడా సన్మానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలపై రాజీ లేకుండా పోరాడుతానని తెలిపారు.
- Advertisement -



