యువతకు స్ఫూర్తి భగత్‌ సింగ్‌

యువతకు స్ఫూర్తి భగత్‌ సింగ్‌భగత్‌ సింగ్‌, ఈ పేరు విన్న ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం భారతీయుల బానిసత్వన్ని పోగొట్టడం కోసం నాటి బ్రిటిష్‌ పాలకుల నుంచి ఈ దేశ సంకెళ్ళలను తెంచడం కోసం 23 ఏండ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు షహీద్‌ భగత్‌ సింగ్‌. 1931 మార్చి 23 సాయంత్రం 7:30 నిమిషాలకు నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం భగత్‌ సింగ్‌ తో పాటు రాజ్‌ గురు, సుక్‌దేవ్‌ లను హుసేన్‌ వాల జైల్‌లో ఉరి తీశారు. ఈ వీరులు ముగ్గురిని ఉరికొయ్యల ముందు నిలబెడితే వారు అదరకుండా బెదరకుండా ఏ మాత్రం అధైర్య పడకుండా ఈ దేశ ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం మరణాన్ని ఆహ్వానించారు.
ఈ దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకదేవ్‌ లు ప్రాణత్యాగం చేసిన రోజు షహీదీ దీవస్‌గా జరుపుకుంటూ, ఈ స్వతంత్ర యోధుల త్యాగాలను గుర్తు చెసుకుంటున్నం. దేశ స్వాతంత్రోద్యమంలో చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా చరిత్రలో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌ 1907 సెప్టెంబరు 27న బంగా, జారన్‌వాలా తహ్సీల్‌, ల్యాల్‌పుర్‌ జిల్లా, పంజాబ్‌, బ్రిటిష్‌ పాలిత భారతదేశంలో జన్మించాడు (ఇప్పుడు అది ఫైసలాబాద్‌ జిల్లా గా పాకిస్తాన్‌ లో ఉంది). కిషన్‌ సింగ్‌ (తండ్రి), విద్యావతి కౌర్‌ (తల్లి), భగత్‌ సింగ్‌ తాత అర్జున్‌ సింగ్‌. ఈయన హిందూ సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 13 ఏండ్ల వయసులోనే గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పుస్తకాలు, దుస్తులు తగులబెటాడు.
గాంధీ అహింసా మార్గాన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుంటే, భగత్‌ సింగ్‌ మాత్రం స్వాతంత్య్రం ఈ దేశ హక్కు, ఈ దేశ స్వేచ్ఛ మన జన్మ హక్కు, మన దేశం స్వాతంత్య్రం సాధించాలంటే బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని దెబ్బకు దెబ్బ కొట్టి ఎదుర్కోవాలి అని భావించాడు. 1919 లో జెలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనతో భగత్‌ సింగ్‌ బ్రిటిష్‌ వారిపై కోపాన్ని పెంచుకున్నాడు. లాహోర్‌లోని నేషనల్‌ కాలేజ్‌లో చేరిన భగత్‌ సింగ్‌ పెండ్లిని సైతం నిరాకరించి, ”నా జీవితాన్ని ఈ దేశం కోసం అంకితం చేస్తాను. నాకు మరో కోరిక లేదు” అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, నవజీవన్‌ భారత సభ అనే సంఘంలో చేరి యువతలో స్వరాజ్య కాంక్షను రగిలించాడు. ఆ తర్వాత హిందూస్తాన్‌ గణతంత్ర సంఘంలో చేరాడు. అక్కడే భగత్‌ సింగ్‌, సుకదేవ్‌ లు మిత్రులు అయ్యారు. వీరిద్దరు చాలా తక్కువ కాలంలోనే ఆ సంఘానికి నాయకులు అయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌ లో లాలాలజపతి రారు ఆందోళనలు చేపట్టగా బ్రిటీష్‌ పోలీస్‌ సూపెరిండెంట్‌ సాండస్‌ లాఠీతో విరుచుకుపడగా, లాలా లజపతి రారు తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో భగత్‌ సింగ్‌, సుక్దేవ్‌, రాజ్‌ గురులు బ్రిటీష్‌ ప్రభుత్వం పై ఆగ్రహం పెంచుకున్నారు. ఆ పోలీస్‌ సూపరిండెంట్‌ను కసితీరా కాల్చి చంపారు. 1929 లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ లో ఇంక్యులాబ్‌ జిందాబాద్‌ అంటూ నినదిస్తూ కరపత్రాలు విసురుతూ బాంబులు విసిరారు. ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడనప్పటికి ఈ ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరించబడ్డారు. పోలీస్‌ సూపరిండెంట్‌ సాండర్స్‌ను చంపినందుకు గాను బ్రిటిష్‌ ప్రభుత్వం వీరిపై హత్యానేరం మోపింది. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక్‌ దేవ్‌ లు కూడా నేరాన్ని అంగీకరించారు. ఏ మాత్రం బెదరకుండా కోర్టులో బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. అనంతరం సెట్లజ్‌ నది ఒడ్డున శవాలను ముక్కలు చేసి కాల్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఇప్పుడు భారత ప్రజానీకం వారి స్మారకం నిర్మించారు.
నరనరాన దేశభక్తితో ప్రతి క్షణం దేశ స్వాతంత్య్రం సాధించాలి అనే కాంక్షతో పట్టువిడవని పోరాటం చేసిన భగత్‌ సింగ్‌, అసలు పోరాటం అంటే ఇలాగే చేయాలి అని యావత్‌ భారత యువతకు చాటి చెప్పిన వ్యక్తి. నేటి యువత కూడా విప్లవానికి అసలైన మార్గదర్శిగా భగత్‌సింగ్‌ను చూస్తున్నారంటే ఆయన చేసిన పోరాట పటిమ ఎంతటి బలమైందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పోరాట యోధుడి మరణం వెనక నేటి యువతకు తెలియని నివురు కప్పిన నిజాలు, ప్రతి భారతీయుడు జీర్ణించుకోలేని వాస్తవాలు చాలా ఉన్నాయి.
అవేంటంటే… నిజానికి ఈ ముగ్గురికి ఉరి శిక్ష 1931 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించారు. కానీ 1931 మార్చ్‌ 23 రాత్రి 7:30 నిమిషాలకు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక దేవ్‌లను ఉరి తీయాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆ రాత్రి ఉరి తీస్తున్నట్లు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక దేవ్‌ లకు కూడా తెలియదు. అసలు మెజిస్ట్రేట్‌ లేకుండానే ఉరిని అమలు చేశారు జైలు అధికారులు. ఆ ముగ్గురిని ఉరికొయ్యల దగ్గరకు తీసుకు రాగా, ఉరితాడు మెడకు వుండగానే భగత్‌ సింగ్‌ జైలు అధికారులను చూసి రోషంతో కూడిన చిరునవ్వు నవ్వుతూ ”నేడు మీరు మమ్మలిని చంపవచ్చేమో కానీ మా ఆశయాలను కాదు” అంటూ…
”ఊగారా ఊగరా ఊగితే శతృవుల గుండె దడ దడా” అంటూ నినదించిన నినాదం జైలు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఇక జైలు అధికారులు భయంతో అనుకున్న సమయం కంటే 15 నిమిషాల ముందే ఉరిని అమలు చేశారు ”ఇంక్యిలాబ్‌ జిందాబాద్‌” అంటూ ఉరికొయ్యలకు ఊగుతూ ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. అయితే ఆ రాత్రి ఉరి తీస్తున్నట్టు దేశ ప్రేజలకు, వారి కుటుంబాలకు ఎలాంటి సమాచారం లేదు. వారు మరణించిన తర్వత కూడా వారి శవాలను ఎటువంటి పోస్టుమార్టం నిర్వహించకుండా సెట్లజ్‌ నది ఒడ్డున సగం కాల్చి నదిలో విసిరేశారు.
అయితే నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం, అలాగే రాజకీయ నాయకులు భగత్‌ సింగ్‌ ఉరి శిక్ష వెనుక చాలా కుట్రలు చేశారు. భగత్‌ సింగ్‌ చేపట్టిన విప్లవ జ్వాల బ్రిటిష్‌ ప్రభుత్వంలోనే కాక మన దేశ నాయకులలో కూడా ప్రకంపనలు సృష్టించింది. దేశమంతా గాంధీ యుగం నడుస్తున్న సమయంలో అతని ప్రసంగాలకు ముగ్ధుడైన భగత్‌ సింగ్‌ దేశ స్వాతంత్య్రం గాంధీ వల్లే సాధ్యం అవుతుంది అనుకున్నాడు. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్‌ పాలన లోనే ప్రకంపనలు రేపింది. భగత్‌ సింగ్‌ కూడా ఆ ఉద్యమంలో చాలా ఆసక్తిగా పాల్గొనే వాడు. కానీ చౌర చౌరి దగ్గర ఉద్యమం హింసాత్మకంగా మారడం వల్ల ఉద్యమాన్ని ఆపాల్సి వచ్చింది. కానీ ఇది ఏ మాత్రం నచ్చని భగత్‌సింగ్‌ తెల్లవాడికి వెన్ను చూపి వెనకడుగు వేయటం ఏంటి అని తనలో తనే కుమిలిపోయి విప్లవ మార్గాన్ని అనుసరించాడు. మరుగుతున్న నెత్తురుతో బ్రిటిష్‌ ప్రభుత్వ పునాదులు కదిలేలా భగత్‌ సింగ్‌ ఎంచుకున్న విప్లవ మార్గం పట్ల దేశ ప్రజలంతా హర్షి ంచారు. ఒక్కప్పుడు గాంధీ చూపిన అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్రం రాదని నమ్మిన దేశ ప్రజలంతా భగత్‌ సింగ్‌ చూపిన విప్లవ మార్గం ద్వారానే సాధ్యం అవుతుందనుకున్నారు. స్వాతంత్య్రం కావాలనే ఆలోచన జాతీయ కాంగ్రెస్‌కి లేనప్పుడే సంపూర్ణ స్వరాజ్యం కావాలని భగత్‌ సింగ్‌ కాంక్షించాడు. దేశ ప్రజలు కూడా భగత్‌ సింగ్‌ ఆలోచనలను స్వాగతించారు. దాంతో దేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తే చాలనుకున్న కాంగ్రెస్‌ నాయకులు వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. 1930లో వారి నినాదం పూర్ణ స్వరాజ్‌ గా మార్చుకున్నారు.
అసలు రాత్రి సమయంలో ఉరి తీసే అధికారం లేదు కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం ఆ నిబంధనలు ఏవీ భగత్‌సింగ్‌ విషయంలో పట్టించుకోలేదు. అసలు భగత్‌సింగ్‌ ఉరికంబం మీద చావలేదు. ఉరికంబాలకు వేలాడుతున్న భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక దేవ్‌ లను ప్రాణం పోయే క్షణంలో వారిని ఉరి నుండి తప్పించి కాల్చి చంపాడు ణూూ. సాండస్‌ మామ, తన అల్లుడు సాండర్స్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉరిశిక్షను రాత్రి పూట అమలు చేశాడు. ముగ్గురి శరీరాల్లో బుల్లెట్లు ఉండడం వల్లే పోస్టుమార్టం చేయలేదు.
భారత స్వాతంత్య్రోద్యమంలో భగత్‌ సింగ్‌ రేకెత్తించిన విప్లవ జ్వాల ప్రతి భారత యువతకు ఎంతో స్ఫూర్తి దాయకం. కొందరి అసూయ కారణంగా 23 ఏండ్ల ప్రాయంలో ఉరికొయ్యని ముద్దాడిన ఆ యువకెరటం బతికి ఉంటే ఆయన కోరుకున్న సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడో వచ్చి వుండేది. ఆనాడు ఉడుకు రక్తంతో ఉన్న యువతలో స్వాతంత్రేచ్చ రగిలించి స్వాతంత్య్ర పోరాటం వైపుకు ఆకర్షించారు. కాని విప్లవ లక్ష్యం సాధించలేక పోయారు. భగత్‌సింగ్‌ సాధించాలనుకున్న లక్ష్యాలతో పోలిస్తే స్వాతంత్య్రం అన్నది చిన్న అంశం. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక దేవ్‌ లు చూపించిన ధైర్య సాహసాలకు తగిన గుర్తింపు రాలేదు. వచ్చి ఉంటే జాతీయోద్యమం వేరుగా వుండేది. భగత్‌ సింగ్‌ ఆశయాలు నెరవేరి ఉండేవి. భారత దేశ చరిత్ర మరోలా ఉండేది. కానీ భగత్‌ సింగ్‌ చేసిన విప్లవ రాజకీయాలను నేటి రాజకీయపార్టీలు విఫల ప్రయత్నంగా చిత్రీకరించారు. ఆయన చరిత్రను భారత పోరాట) చరిత్రలో కేవలం ఒక అధ్యాయంగా మార్చేశారు.
– దామెర్ల హష్మీ బాబు
7660057095

Spread the love