జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలు

Ways to improve memoryఒక్కసారి విన్న కథ, ఒక్కసారి చూసిన సినిమా, సచిన్‌, కోహ్లీ ఎన్ని సెంచరీలు చేశారు?… ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా… ఎన్ని సంవత్సరాల తరువాత అడిగినా ఠక్కున సమాధానం చెప్పేస్తారు! అంటే మీ జ్ఞాపకశక్తి బాగున్నట్టే కదా! మరచిపోతున్నా అనే భ్రమలో ఉన్నా, విషయాలు అర్థం కాకపోయినా, ఆసక్తి చూపలేకపోయినా, ఎక్కువగా డ్రగ్స్‌ ఉపయోగించినా, తలకు దెబ్బ తగిలినా మర్చిపోతాం. అంతేగానీ… ఒక్కసారి మన మెదడులో నిక్షిప్తమై ఉంటే దాన్ని ఎప్పటికీ మరచిపోం.
జ్ఞాపకం ఉంచుకోవడం ఓ సహజ ప్రక్రియ. ఆ జ్ఞాపకశక్తిని పటిష్టంగా ఉంచుకోవాలన్నా… సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నా తగిన అవగాహన అవసరం. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో, జ్ఞాపకశక్తిని జీవితాంతం కొనసాగించుకోవడానికి కూడా తగిన ప్రయత్నం అవసరం. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోడానికి కొన్ని నైపుణ్యాలున్నాయి.
సంస్థాగత నైపుణ్యాలు :
సెమిస్టర్‌ ప్రారంభంలో క్లాస్‌లో ఏం నేర్చుకున్నారో గుర్తు చేసుకోడానికి, ఇంకా ఏమేమి నేర్చుకోవాల్సి వుందో తెలుసుకోడానికి పాఠ్యపుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని ప్రివ్యూ చేయండి. ఇంకా చదవాల్సినవి తెలుసుకోడానికి ఇది ఫ్రేమ్‌వర్క్‌లా ఉపయోగపడతుంది.
సమాచారంతో కనెక్ట్‌ :
తరగతిలో నేర్చుకుంటున్న విషయాలకు, మీ దైనందిన జీవితం లేదా భవిష్యత్తు వత్తికి మధ్య కనెక్షన్‌లను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన సమాచారాన్ని సులభంగా నేర్చుకోవడమే కాదు, గుర్తుంచుకుంటారు కూడా. మీకు ఇప్పటికే తెలిసిన సమాచారాన్ని కొత్త సమాచారంతో కనెక్ట్‌ చేస్తే విషయాన్ని సులభంగా నేర్చుకోవచ్చు, గుర్తుంచుకోవచ్చు. క్లాస్‌లో టీచర్‌ ఎగ్జాంపుల్స్‌తో వివరిస్తుంటారు. అవి గుర్తుతెచ్చుకోగలిగితే సబ్జెక్ట్‌ ఈజీగా అర్ధమవుతుంది.
ఎవరైనా తామ చేసే వాటిలో 90 శాతం, చూసే వాటిలో 75 శాతం, విన్న వాటిలో 20 శాతం గుర్తుంచుకుంటారు. శరీరాన్ని చురుకుగా ఉంచడం వల్ల జ్ఞాపకశక్తి బాగుంటుంది. శరీర కదలిక వల్ల అధ్యయన ప్రక్రియలో శక్తిని నింపుతుంది. అందుకే బిగ్గరగా చదవండి. ఏదైనా సెమినార్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగించినట్లయితే ఇంకా కొత్తవి నేర్చుకోడానికి సహాయపడుతుంది.
రిలాక్స్‌ ముఖ్యం :
మీరెప్పుడైనా గమనించారా? పరీక్ష రాసేటప్పుడు ఎంత ఆలోచించినా గర్తురాని ఆన్సర్స్‌, మీరు ఎగ్జామ్‌ రాసి బయటకు రాగానే మొత్తం గర్తుకొస్తుంది. దీనికి కారణం పరీక్షకు ముందు విశ్రాంతి తీసుకోకపోవడం. కొన్ని సమయాల్లో విశ్రాంతి కూడా రక్త ప్రసరణని మెరగుపరుస్తుంది. తద్వారా స్పష్టంగా ఆలోచించొచ్చు.
విజువలైజేషన్‌ :
అభ్యాస ప్రక్రియను ఎంత దశ్యమానంగా చేస్తే, సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంత సులభం అవుతుంది. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు సజనాత్మకంగా విజువలైజేషన్‌ చేసుకోండి.
నేర్చుకున్నదాన్ని దశల వారీగా విభజించి మళ్లీ ఒకసారి మననం చేసుకోండి. ఆ ప్రాసెస్‌ను స్నేహితునితో డిస్కస్‌ చేయండి. కొత్తగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్‌ని బట్టి, ఏ టెక్నిక్‌ వుపయోగించాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.
రీకాల్‌ కోసం సమయం :
సబ్జెక్ట్‌ రివిజన్‌ కోసం సమయాన్ని ప్లాన్‌ చేయండి. రివ్యూ పద్ధతులు మార్చితే మంచిది. పెద్దగా చదవటం, ఇంపార్టెంట్‌ విషయాలను రాయటం, స్నేహితులతో చర్చించటం వలన మెటీరియల్‌పై లోతైన అవగాహన ఏర్పడుతుంది.
ఏకాగ్రతకోసమైనా, పాఠ్యాంశాలు జ్ఞాపకం తెచ్చుకోడానికైనా కొంత సమయం విశ్రాంతి రూపంలో కేటాయించాల్సిందే. తక్కువ సమయంలో ఎక్కువ చదివేయాలని, ఎక్కువ పనులు చేయాలని ప్రయత్నించకుండా కొన్నింటిని మాత్రమే ఎంచుకోవాలి.
రోజువారీ జీవనం ద్వారా, జీవన చర్యల్లో పంచేంద్రియ జ్ఞానాన్ని విస్తతంగా యోగించుకోవటం ద్వారా జ్ఞాపకశక్తిని ఏవిధంగా మెరుగుపరుచుకోవచ్చో భారతదేశ తొలి మహిళా స్టేజీ హిప్నాటిస్ట్‌ గా, భారత ప్రభుత్వ అవార్డు పొందిన తొలి కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌గా, వేలాదిమంది దాంపత్యజీవితాలలో వెలుగులు నింపిన మ్యారేజ్‌ – ఫ్యామిలీ – హెల్త్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్‌గా నేను రాసిన పుస్తకం ‘జ్ఞాపకశక్తి’ చదవండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

Spread the love