ఎలా చెప్పాలి?

మా పాప 9వ తరగతి చదువుతోంది. ఒక్కతే పాప అని చాలా గారాబంగా పెంచాం. ఇప్పుడు చాలా మొండిగా తయారయింది. తను అడిగింది ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది. ఫోన్‌కి బాగా అలవాటయింది. ఇవ్వకపోతే అలిగి ఏడుస్తూ కూర్చుంటుంది. ఈ విషయంలో కోప్పడుతున్నానని నన్ను ఒక శత్రువులా చూస్తుంది. తనకు ఎలా సర్ధి చెప్పాలో అర్థం కావట్లేదు.
స్వప్న, హైదరాబాద్‌
హల్లో స్వప్న గారు
నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యే ఇది. ఒక్కతే అమ్మాయి అవడం వల్ల గారాబం చేసాం అన్నారు. దాని ప్రభావం కొంత ఉండవచ్చేమో కానీ అదే కారణం కాదు.
”మా పిల్లలు gadjets అయ్యారు. మీరు వాళ్లకి కౌన్సిలింగ్‌ ఇస్తారా?” అని నన్ను చాలా మంది తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు. నా దగ్గర సొల్యూషన్‌ లేదని చెప్తాను. ఈ విషయంలో మేం ఏ సలహా ఇచ్చినా అవి డిస్కోర్సెస్‌ అవుతాయి తప్ప ఆచరణకి సాధ్యం కాదు. దానికి కారణం సమస్య తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఈరోజు మీ ప్రశ్న ద్వారా నేను చాలామంది తల్లిదండ్రులకు కొన్ని విషయాలు తెలపాలనుకుంటున్నాను.
ముందుగా అసలు సమస్య ఎక్కడ ఉందో వివరించి ఆ తర్వాత దాన్ని కంట్రోల్‌ చేయగల మార్గాలని మాత్రం సూచించగలను.
పూర్వం తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు అంటే ఉదయం 9 గంటలకి ఆఫీసుకి వెళ్లి సాయంత్రం 6:00 గం.కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. మిగిలిన రోజంతా కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లు. అంటే కుటుంబానికి, ఉద్యోగానికి కూడా సమయం కేటాయించగలిగేవాళ్లు.
కానీ ఇప్పుడు అలా కాదు. ఎస్పెషల్లీ వర్క్‌ ఫ్రం హోం వచ్చాక వాళ్ళకి ఒక పరిమిత సమయం అంటూ ఉండడం లేదు. ఉదయం 8 గంటలకి సెల్‌ ఫోను లాప్‌టాప్‌, చేత్తో పట్టుకుంటే రాత్రి 8, 9 గంటల దాకా వాటితోనే సాంగత్యం అయిపోతోంది.
దానితో వాళ్ళు శారీరకంగా మానసికంగా అలసిపోతుంటారు. ఇటు తల్లిదండ్రులతో కానీ, అటు పిల్లలతో కానీ క్వాలిటీ టైం స్పెండ్‌ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండడం లేదు.
అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరూ ఎవరితోనూ కలిసి గడప లేకపోతున్నారు. దానితో పెద్ద వాళ్ళు మానసికంగా ఒంటరితనం ఫీల్‌ అవుతున్నారు. ఆ పరిస్తితిలో peer pressure లే వాళ్ళకి కాలక్షేపం అవుతున్నాయి. ఎక్కువ సమయం వాటితోనే గడిపేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరుతో పేరెంట్స్‌ చాలామంది సెల్‌ఫోన్లో ఎంగేజ్‌ అయిపోతున్నారు. అంతేకాకుండా మన రోజువారి అవసరాలన్నిటికీ ఎక్కువగా సెల్‌ ఫోన్స్‌ నే వాడటం జరుగుతుంది. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతినెలా చేయవలసిన పేమెంట్స్‌ వరకు అన్ని సెల్‌ఫోన్‌ ద్వారానే చేస్తున్నాం. ఇవన్నీ పిల్లల మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. దానివల్ల కూడా పిల్లలు సెల్‌ఫోన్‌ వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కాకపోతే apps రని పెద్దవాళ్లు వాడటానికి, చిన్నపిల్లలు వాడటానికి చాలా తేడా ఉంది. పెద్దవాళ్ళు ఒక అవగాహనతో వాటిని ఉపయోగిస్తారు కాబట్టి అంత ప్రమాదం ఉండదు. పిల్లలకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి ప్రమాదకరమైన aజూజూర లోకి వెళ్ళిపోయి వాళ్ళు చిక్కుల్లో పడటమే కాకుండా పెద్దవాళ్ళని కూడా చిక్కుల్లో పడేసే అవకాశం ఉంటుంది. అలా అని పిల్లల్ని పూర్తిగా content కి దూరంగా ఉంచడం, వారిపై ఆంక్షలు పెట్టడం కూడా మంచిది కాదు. దానివల్ల వేరే రకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
నేటి తరం పిల్లల మనోవికాసానికి, విజ్ఞానాభివద్ధికి తోడ్పడే శక్తివంతమైన ప్రధాన సాధనాలుగా gadjets ఎన్నో రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు పిల్లలు ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, సమాచారాన్ని తెలుసుకోవాలన్నా పుస్తకాల మీద ఆధారపడేవాళ్లు. ఇవాళ ఆ పుస్తకాలు కూడా ఇంటర్నెట్‌లోనే దొరుకుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌ సిస్టంలో స్మార్ట్‌ లేర్నింగ్‌ మీద ఎంఫసిస్‌ పెరగడంతో పిల్లల ఎడ్యుకేషన్‌ లో కూడా ఇంటర్నెట్‌ అనేది ఒక పార్ట్‌ అయిపోయింది. కాబట్టి పిల్లలకి సెల్‌ ఫోన్స్‌ కొనివ్వక తప్పడం లేదు. కానీ వాళ్లు సెల్‌ ఫోన్‌లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది పెద్దవాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. పిల్లలు చేసేది ఒకటి, పెద్దవాళ్ళకి చెప్పేది ఒకటి అవుతోంది. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. దీనికి తోడు జూవవతీ జూతీవరరబతీవ ఒకటి. పిల్లలు ఎక్కువగా రకరకాల influence, వాటిలో వచ్చే parents గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి పిల్లల్ని మనం parental content supervision కి దూరంగా ఉంచటం అనేది జరిగే పని కాదు.
వీటన్నిటి బట్టి ఇంటర్నెట్‌, గాడ్జెట్స్‌ అనేవి మన జీవన శైలిలోకి ఎంతగా చొచ్చుకొని వచ్చేసాయో మనకి స్పష్టంగా తెలుస్తోంది.
పిల్లలు గ్యాడ్జెట్స్‌కి అడిక్ట్‌ అవటానికి ఇవే కారణాలు.
ఇక పోతే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పగలిగిన సలహా ఏంటి అంటే –
బ పిల్లలు ఏ కంటెంట్‌  చేస్తున్నారో, దేని వల్ల Gadget free zone అవుతున్నరో lunch and dinner తెలుసుకోగలగాలి. అందుకుbedtime one hour అనేది చాలా ఉపయోగ పడుతుంది.
dinner  వల్ల కూడ వాళ్ళకి ఉన్న అడిక్షన్ని కొంత వరకు అరికట్టవచ్చు. అంటే dinner టైంలో, బాత్రూంలో, gadgets ముందుగా గాడ్జెట్ల వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి.
బ వారంలో కనీసం నాలుగు రోజులు కుటుంబ సభ్యులందరూ కలిసి సఱఅఅవతీ చేయడం, సఱఅఅవతీ చేసేపుడు సరదా కబుర్లు చెప్పుకోడం వల్ల పిల్లల మనసు ఆ కొద్ది సేపయినా activities వైపు వెళ్లదు. ఆ టైంలో పిల్లల చదువు గురించి ఇంటి విషయాల గురించి మాట్లాడవద్దు. పిల్లలు వాటిని ఇష్టపడరు.
బ పిల్లలు 5-6 తరగతులకు వచ్చినప్పుడే వాళ్ళకి ఏ రకమైన For example ఇష్టమో తెలుసుకుని వాటిలో శిక్షణ ఇప్పించాలి., స్పోర్ట్స్‌, డాన్స్‌, మ్యూజిక్‌, చెస్స్‌ వంటివి.
బ వీలయినంత వరకు ప్రతి రోజూ ఎంతో కొంత సమయం శారీరక వ్యాయామం చేసేలా చూడాలి. ఆ సమయంలో వాళ్ళకి  అందుబాటులో ఉండకూడదు.
బబెడ్‌ టైమ్‌ లో పిల్లల దగ్గర సెల్‌ఫోన్‌ లేకుండా చూడాలి. లేకపోతే అర్ధరాత్రి ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు సెల్‌ఫోన్‌ చూడడం ఆ టైమ్‌లో కూడా మెసేజెస్‌ పంపడం చేస్తూ ఉంటారు. అడ్డిక్షన్‌ అంటేనే అది. అది ఎంత మాత్రం సేఫ్‌ కాదు. విచిత్రం ఏంటంటే మొదట మెలుకువ వచ్చినప్పుడు వీళ్ళు సెల్‌ఫోన్‌ చూస్తారు. మెదడుకి అదొక వ్యసనంగా మారి ఆ తర్వాత సెల్‌ఫోన్‌ చూడడం కోసం మెలుకువ రావడం మొదలవుతుంది.
బ వీటన్నిటితో పాటు పేరెంట్స్‌ వీలయినంత వరకు పిల్లలతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయాలి. ఆ టైమ్‌లో పిల్లలతో సినిమాలు, పుస్తకాలు, స్పోర్ట్స్‌, రకరకాల ప్రదేశాల గురించి మాట్లాడాలి. పిల్లలు ఎక్కువగా అలాంటివి ఇష్టపడతారు.
బ తల్లితండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం…. పిల్లలకి మనం ఏది నేర్పాలన్నా మాటలతో చెప్పటం కన్నా ఆచరించి చూపిస్తే చప్పున అర్థం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎక్కువగా entertainment websites చూడటం,online shopping ల్లో లీనమై పోవటం చేయకూడదు. పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు.
కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్‌లో అంత సాధ్యం కాదు అని నాకు కూడా తెలుసు. ఇది ఒక టీమ్‌ వర్క్‌ లాంటిది. దీనికి కుటుంబ సభ్యులందరి సహకారం ఉండాలి. అందరికీ సమయం కుదరాలి. అందరికీ ఈ సలహాలు నచ్చకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉండవచ్చు. అన్నిటినీ సమన్వయించుకొని ఎంతో కొంత ప్రయత్నం చేస్తే కొంత అయినా ఫలితం ఉంటుంది అని నా అభిప్రాయం.
సెల్‌ఫోన్‌ అడిక్షన్‌ అనేది చాలా తీవ్రమైన సమస్య. అది పిల్లల మెదడు మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. దానివల్లే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తోంది. వాళ్ళలో అసహనం పెరిగిపోవడం ప్రతి చిన్న విషయానికి  అయిపోవడం, తల్లిదండ్రులని నిందించడం, సామాజిక జీవితానికి దూరంగా గదిలో వంటరిగా గడపడం లాంటి behavioral issues వస్తున్నాయి. అందుకే మీ అమ్మాయి కూడా మీ మీద అలగటం, మిమ్మల్ని శత్రువుల్లా చూడడం జరుగుతోంది.
సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలకి మెడ నరాలు, వెన్నుముకకి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాల అన్నిటి మీదా స్కూళ్లలో, కాలేజిల్లో కూడ అవగాహన కార్యక్రమాలని విస్తతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్వప్న గారు! మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి గట్టిగా ప్రయత్నం చేయండి. కొంత టైమ్‌ తీసుకున్నా కొంతైనా ఫలితం ఉంటుందని నమ్మకంతో ఉండండి.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌,
ఫ్యామిలీ కౌన్సిలర్‌

Spread the love