బొడ్రాయి పండుగకు భువనగిరి ఎంపీ రూ.50 వేలు విరాళాలు అందజేత

– జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
జూన్‌ 01వ తేది నుంచి 05 వరకు మండల పరిధిలోని సత్యం తండాలో నిర్వహించే బొడ్రాయి పండు గకు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట ్‌రెడ్డి రూ.50 వేలు విరాళాలుగా అందజేసినట్టు జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ మీటింగ్‌లో రాహుల్‌ గాంధీతో పాల్గొనేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికాకు వెళ్లినట్టు తెలి పారు. ముఖ్యంగా ప్రజలు పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునీ, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యం తండా సర్పంచ్‌ పెంట్యానాయక్‌, ఉప సర్పంచ్‌ జ్యోతి బాలునాయక్‌, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

Spread the love