పర్యావరణాన్ని కాపాడుదాం

– సర్పంచ్‌ యాలాల శ్రీనివాస్‌
నవతెలంగాణ-కందుకూరు
ప్రతి ఒక్కరూ పర్యవరణాన్ని కాపాడాలని సర్పంచ్‌ యాలాల శ్రీనివాస్‌ అన్నారు. కందుకూరు మండల్‌ బాచు పల్లి గ్రామంలో మంగళవారం ప్రపంచ పర్యావరణ దినో త్సవం సందర్భంగా పర్యావరణంపై, జీవన శైలిపై అవగా హనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జీవన విధానంలో పర్యావరణాన్ని కలుషితం కాకుండా ప్లాస్టిక్‌, వాడకుండా, మన ఇండళ్లలో ఉపయోగించే, కూరగాయలు వేస్టేజ్‌, తడి,పొడి చెత్తను వేర్వేరు చేయాలని చెప్పారు. ఆ విధంగా ఎక్కువ గాలి లో కలిసే రాసా యాణాలు వెదజల్లే, వాటిని ఉపయోగించువద్దని సూచిం చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి, పర్యా వరణాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి కిష్ణమాచారి, అంగవాడీ టీచర్‌ యాదమ్మ, గ్రామస్తులు ఈ. కేతమ్మ, మరియాదా అనసూయ, కొంరమ్మ బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షులు ఎ. నరేష్‌, కారోబార్‌ సుధాకర్‌ తదితరులున్నారు.

Spread the love