రఫాపై ఇజ్రాయిల్‌ దాడిని ఆమోదించిన బైడెన్‌

ఇజ్రాయిల్‌ గాజాలోని దక్షిణానగల నగరమైన రఫాపై దాడిని సోమవారంనాడు ప్రారంభించింది. జనాభాను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. 12 లక్షల కంటే ఎక్కువ మంది శరణార్థులు(వీరిలో 600,000 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు) ప్రస్తుతం రఫాలో తగినంత ఆహారం, నీరు, పరిశుభ్రత లేదా మందులు లేకుండా దుర్భర పరిస్థితులలో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయిల్‌ సోమవారం గాజా అంతటా నివాస గహాలపై బాంబుదాడి చేసింది. అనేకమంది మరణించారు. వీరిలోఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఎంతోమంది గాయపడ్డారు. మంగళవారం ఇజ్రాయి రఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుని గాజాలోని ఆకలితో అలమటిస్తున్న జనాభాకు కీలకమైన ఆహారాన్ని మూసివేసింది. మంగళవారం ఒక ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్‌ రఫా నగరంపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిని సమర్థించాడు. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహౌమాన్ని సమర్థించ డానికి నీచంగా హౌలోకాస్ట్‌ను ఉపయోగించుకున్నాడు. ”యూదులపై ఈ పురాతన ద్వేషం హౌలోకాస్ట్‌తో ప్రారంభం కాలేదు… ఈ ద్వేషం చాలా మంది వ్యక్తుల హదయాల్లో లోతుగాకొనసాగుతూనే ఉంది… ఆ ద్వేషం అక్టోబర్‌ 7, 2023న ప్రాణం పోసుకుంది” అని బైడెన్‌ ప్రకటించాడు. ఐరోపాలో అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారీ రాజ్యమైన నాజీ జర్మనీలో అరవై లక్షలకుపైగా యూదులను హతమార్చిన హౌలోకాస్ట్‌ను అక్టోబర్‌ 7 నాటి సంఘటన లతో సమానం చేయడానికి బైడెన్‌ చేసిన ప్రయత్నం చరిత్రను పూర్తిగా తప్పుదారి పట్టించడమే అవుతుంది.
హౌలోకాస్ట్‌కు, గత ఆరు నెలలుగా జరుగుతున్న సంఘటనలకు మధ్యగల ఏకైక సమాంతరం ఏమిటంటే నాజీ జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణకాండను తలపించేలా నేడు యూదు దేశమైన ఇజ్రాయిల్‌ గాజాలోని పాలస్తీనియన్లను హతమారు స్తోంది. గత 75 సంవత్సరాలలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ చేసిన నేరాలను, ఘోరాలను, హత్యాకాండలను బైడెన్‌ అసలు పట్టించుకోలేదు. బైడెన్‌ ప్రసంగం అన్ని ముఖ్యమైన విషయాలలో హౌలోకాస్ట్‌ స్మారక కార్యక్రమంలో బెంజమిన్‌ నెతన్యాహు శుక్రవారం చేసినవ్యాఖ్యలకు అద్దం పట్టింది. రఫాపై దాడి చేసి గాజా మొత్తాన్ని లొంగదీసుకుంటానని ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి ప్రతిజ్ఞ చేశాడు. ” ఎన్ని విభేదాలున్నప్పటికీ ఇజ్రాయిల్‌ భద్రతకు, స్వతంత్ర యూదు రాజ్యంగా ఉనికిలో ఉండటానికి నేను నిబద్దుడై ఉన్నాను” అని బైడెన్‌ మంగళవారం చేసిన ప్రసంగంలో గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమానికి తన పూర్తి మద్దతును పునరుద్ఘాటించాడు. వాస్తవానికి, రఫా దండయాత్రతో బైడెన్‌ ”ఏకీభవించలేదు”అనే వాదన అబద్ధం. ఇజ్రాయిల్‌ పాలన ఏమి చేసినా ఎటువంటి పరిణామాలు ఉండవని బహిరంగంగా ప్రకటించడం ద్వారా గాజా జనాభాను ఊచకోత కోయడానికి వైట్‌ హౌస్‌ ఇజ్రాయిల్‌కు ఒక బ్లాంక్‌ చెక్‌ ఇస్తోంది. గాజా మారణహౌమాన్ని బైడెన్‌ సమర్థించడం, యుద్ధ వ్యతిరేక నిరసనలపై అతని అణిచివేత సెమిటిజం వ్యతిరేకతతో ప్రేరేపించబడిందనే వాదన అబద్ధం. వందలాది నిరసనకారులు బైడెన్‌ పోలీసు అణిచివేతకు గురయ్యారు. వీరు పోలీస్‌ లాఠీలను, బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ఎదుర్కొన్నారు. అరెస్టు చేయబడ్డారు. వారాంతంలో, న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ గాజా మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలను ‘ముగిస్తాము’ అని బెదిరించాడు. అయితే సెనేటర్‌ టామ్‌ కాటన్‌నిరసనలను ‘చిన్న గాజాలు’ అని పేర్కొన్నాడు. పోలీసులు నిరసనకారులను గాజాలో ప్రజలను ఇజ్రాయిల్‌ పరిగణిస్తున్నట్లుగానే పరిగణించాలని సూచించాడు.మారణహోమానికి వ్యతిరేకతను సెమిటిజం అని నిందించడంలో బైడెన్‌ జియోనిస్ట్‌ అబద్ధాన్ని పునరావతం చేస్తున్నాడు. ఇది యూదుల గుర్తింపును ఇజ్రాయిల్‌కు మద్దతుతో సమానం చేస్తుంది. ఈ మితవాద కథనం ప్రకారం, అమెరికన్‌ యూదులు వారి మతం ద్వారా నిర్వచించబడి ఇజ్రాయిల్‌ రాజ్యంతో విడదీయరాని సంబంధంలో ఉంటారు. జియోనిస్ట్‌ రాజ్యం సామ్రాజ్యవాదం సాధనంగా ఎల్లవేళలా పనిచేస్తోంది. హౌలోకాస్ట్‌ ను ఉటంకించటం ద్వారా అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దోపిడీ ప్రయోజనాలను సమర్థించటానికి బైడెన్‌చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నగంగా కనిపిస్తున్న దగాగా భావిస్తున్నారు. మానవ హననాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించటాన్ని 20వ శతాబ్దంలో సాగించిన మారణ హోమాలను పునరావతం చేయాలనే ఉద్దేశంగల ఒక సామ్రాజ్యవాద దేశం బహిరంగంగా ఆమోదించటమే బైడెెన్‌ ప్రసంగ సారం.

Spread the love