బినాన్స్‌ సీఈవో రాజీనామా..

నవతెలంగాణ-హైదరాబాద్ :  క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ సంస్థ బినాన్స్‌ సీఈవో పదవికి సంస్థ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్‌ జావో మంగళవారం రాజీనామా చేశారు. 4.3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక లావాదేవీలో అమెరికా మనీ ల్యాండరింగ్‌ చట్టాలను ఉల్లంఘించినట్లు ఒప్పుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘బినాన్స్‌ సీఈవో పదవి నుంచి వైదొలిగాను. మానసికంగా ఇది అంత సులభం కాకపోయినా నేను చేసిన పని సరైనదే. తప్పులు చేసింది నేను కాబట్టి.. నేనే బాధ్యత వహించాలి. బినాన్స్‌ సంస్థ మరింత ఎదగాలని కోరుకుంటున్నా’’అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు. సంస్థలో రీజినల్‌ మార్కెట్స్‌ గ్లోబల్‌ హెడ్‌గా వ్యవహరిస్తోన్న రిచర్డ్‌ టెంగ్‌ను నూతన సీఈవోగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Spread the love