రాజస్థాన్ లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ

బీజేపీ.. 105- 10
కాంగ్రెస్‌.. 62- 07
ఇతరులు .. 14 -01
నవతెలంగాణ న్యూఢిల్లీ
:
దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ (Telangana),రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh),ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh),అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Assembly election counting) ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు మిజోరం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినప్పటికీ షెడ్యూల్డ్ తేదీకి ఒక రోజు తరువాత డిసెంబర్ 4న అక్కడ కౌంటింగ్ జరుగనుంది. ఐదు రాష్ట్రాల పోలింగ్ నవంబర్ 7న మొదలై 30తో ముగిసింది. ఛత్తీస్‌గఢ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ఒకే విడతలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి. కాగా, ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకాగా, తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతోంది. అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కంపు మొదలవుతుంది.

రాజస్థాన్

రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న పోలింగ్ జరిగింది. కరణ్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ హఠాన్మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తోంది. కాగా, రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ కోసం 979 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

కృష్ణపోలే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజిన్‌ కాగ్జి ముందంజ

 

Spread the love