మంత్రి హరీశ్ రావుతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ

harish-rao-Raja-Singhనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోపక్క, ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా చెపుతున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ చెప్పారు. ఇతర విషయాల గురించి తాము చర్చించలేదని అన్నారు.

Spread the love