మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా

న్యూఢిల్లీ: కర్నాటక ఫలితాలతో షాక్‌లో ఉన్న బీజేపీ మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే.. బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 90 మంది ఎమ్మెల్యేలు ఉండే చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. 230 మంది ఎమ్మెల్యేలు ఉండే మధ్యప్రదేశ్‌ కోసం తొలి లిస్టులో 39 మందిని ఖరారు చేసింది.

Spread the love