మతోన్మాద ధోరణులు రెచ్చగొట్టడానికే బీజేపీ ప్రాధాన్యత

 BJP's priority is to incite fanatical tendencies– హర్యానాలో మరో హిందూ మహా పంచాయత్‌ ! : తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
రోహీతక్‌ : హర్యానాలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నా తిరిగి పల్వాల్‌ జిల్లాలోని పాండ్రి గ్రామంలో ‘సర్వ జాతీయ హిందూ మహా పంచాయత్‌’ ను నిర్వహించడానికి అనుమతించడం పట్ల సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే శాంతి సామరస్యతలు నెలకొనేలా చూడడం కన్నా మతోన్మాద ధోరణులు రెచ్చగొట్టేలా చేయడానికే బిజెపి ప్రభుత్వ ప్రాధాన్యతని స్తోందని స్పష్టమైందని పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అల్లర్లు జరిగిన నుV్‌ా జిల్లాకు పక్కనే గల గ్రామంలో ఈ మతపరమైన సమావేశం నిర్వహించడానికి ప్రేరేపించబడిన కారణాలు ఏమిటని ఆ ప్రకటన ప్రశ్నించింది. అయితే ఆ పంచాయత్‌ను స్థానిక ప్రజలు బహిష్కరించడాన్ని పార్టీ స్వాగతించింది. హర్యానాలో గానీ ఈ బ్రజ్‌ ప్రాంతంలో గానీ గతంలో ఇలా ఏ ఒక్క మతం పేరుతో పంచాయితీలు నిర్వహించిన దాఖలాలు లేవని పార్టీ పేర్కొంది. కానీ ఈ పంచాయితీలో యూపీ, రాజస్థాన్‌, ఢిల్లీలకు చెందిన విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌, గో రక్షా దళ్‌ వంటి మతోన్మాద సంస్థలు ఇలా పంచాయితీలు నిర్వహిస్తున్నాయి. పంచాయితీలో మాట్లాడిన వారందరూ ముస్లింలపై అభ్యంతరకర మైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు వారిపై తిరగబడాలని పిలుపిచ్చారు. ప్రతి హిందూ గ్రామలో కనీసం వంద మందికి ఆయుధాలు ఇచ్చి యువ రక్తం మరుగుతూ వుండేలా చూడాల్సి వుందని గోరక్షా దళ్‌కి చెందిన ఆచార్య అజాద్‌ శాస్త్రి పిలుపునిచ్చారు. తిరిగి ఆగస్టు 28న నుహ్ లోని నల్హాడ్‌ నుంచి బ్రజ్‌ మండల్‌ జలాభిషేక్‌ యాత్రను చేపట్టాలని ఈ పంచాయితీ నిర్ణయించింది. నిర్వాహకులు ఇలా బహిరంగంగానే విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై ఏం చర్యలు తీసుకుంటారని జిల్లా యంత్రాంగాన్ని సీపీఐ(ఎం) ప్రశ్నించింది.

Spread the love