రంగాపూర్ లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన మహౌత్సవం

– 10 వేల రూపాయల విరాళం అందజేసిన ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని రంగాపూర్ గ్రామంలో రెండు రోజులుగా బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాలకు అభి షేకం చేసి అనంతరం హౌమం చేశారు. గ్రామంలో బంధుమిత్రులు రావడంతో ప్రతి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొడ్రాయి కార్యక్రమానికి గ్రామస్తులకు రూ.10 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యే కు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో తెలంగాణ సాంస్కతి ఉట్టిపడుతుందని అన్నారు. అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్టాపన మహౌత్సవ కార్యక్ర మాన్ని ప్రముఖులు సందర్శించి మొక్కులు చెల్లించు కున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ, బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, మాజీ సర్పంచ్ బెజ్జూరు శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ భాషబోయిన రమేష్, నాయకులు మాజీ ఎంపిటిసి చిన్న రామయ్య, నాయకులు కోళ్ల వెంకన్న, దాయ వెంకటేశ్వర్లు, అల్లెం సాంబశివరావు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు దెబ్బ సంఘాల నాయకులు వివిధ ప్రజాసంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love