బెంగళూరు హోటళ్ళకు బాంబు బెదిరింపులు..

నవతెలంగాణ – బెంగళూరు:  బెంగళూరు లోని ప్రముఖ హోటల్‌ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ నుంచి ఇవి వచ్చినట్లు హోటల్‌ యాజమాన్యాలు తెలిపాయి. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్ల వారు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వీటి సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని.. తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love