క్షత్రియ మహిళల బోనాల ఉత్సవాలు

Bonala festivals of Kshatriya womenనవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ క్షత్రియ మహిళ మండలికి చెందిన మహిళలు బుధవారం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. క్షత్రియ భవన్ నుంచి నుంచి దాదాపు 50 మంది మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఆ తర్వాత బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ ఆలయం వరకు డప్పులు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. క్షత్రియ కులస్తులు పిల్లాపాపలతో సల్లంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు కురవాలని గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కినారు. అనంతరం పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలందరూ సామూహిక భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ మహిళా న్యాయవాది, మున్సిపల్ కౌన్సిలర్, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర మహిళా మండలి సలహాదారులు సంగీత ఖాందేష్ హాజరయి బోనాలెత్తుకున్నారు. ఈ కార్యక్రమములో గ్రామ క్షత్రియ సమాజ్ అధ్యక్షులు ఖాందేష్ సుదర్శన్, కార్యదర్శి అల్జాపూర్ నంద కిషోర్, కోశాధికారి గుజరాతీ రామ్ దాస్, రాష్ట్ర నాయకులు జెస్సు అనిల్, క్షత్రియ మహిళా మండలి సభ్యులు సుజాత, రేఖ, వాణి, లత, సరస్వతి, మంజుల, రూప, శ్వేత అల్జాపూర్ రాజ సులోచన, జెస్సు లలిత, సాత్ పుతే మంజుల, గౌతమి, మేఘ ఇంద్ర, కవిత, శ్రీలక్ష్మి, లత, గీత, సునీత  తదితరులు పాల్గొన్నారు.
Spread the love