మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే: రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్‌లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారు. త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశాం.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Spread the love