దేశ వ్యాపితంగా ఎన్నికలవేడి పెరుగుతున్నకొద్దీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం పెరగడం కనిపిస్తు న్నది. ఆయా పాలకవర్గాల ప్రయోజనాలకు అను కూలంగా మీడియా కావాలని ఇచ్చిన కథ నాలు హైప్‌లు వెనక్కుపోయి వాస్త వాలు, వారి వారి నిజరూపాలు వెల్లడవు తున్న దశ. ఇండియా వేదిక చెల్లా చెదురైపోతుంటే మోడీ 400 స్థానాల వైపు దూసుకుపోతున్నట్టు ఏకపక్షంగా ప్రచారంలో పెట్టిన దృశ్యం ఇప్పుడిప్పుడే చెదిరిపోయి భిన్నశక్తుల సమీకరణాలు, సమిష్టి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తు న్నాయి. ఏపీలో సిద్ధం అంటున్న వైసీ పీ ఆర్భాట సభల ఆర్భాటం, బీజేపీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ పరువుతగ్గించుకున్న టీడీపీ, జనసేన ఒక జాబితా ప్రకటించినప్పటికీ ఈ అయోమయం మాత్రం మరింత పెరుగుతున్నదే గానీ తగ్గడం లేదని తేలి పోయింది. ఈ అవకాశవాద విన్యాసాలు పదవీ కాంక్షల పల్టీలు, మేకపోతు గాంభీర్యాలు, గోడ దూకుళ్లు రంగు మార్పిళ్ల ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణ ఎలాగన్నదే ఎప్పుడూ కీలక ప్రశ్న, ఆ దిశలో లభిస్తున్న పరిణా మాలు సమాచారాలు ఎలా వున్నయన్నది ఒకసారి తేరిపారచూడాల్సి వుంటుంది.
ఏపీలో చర్చలు, దేశంలోనూ మార్పులు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల ఆహ్వానంపై ఉభ య కమ్యూనిస్టుపార్టీల ప్రతినిధులు విడివిడిగా సమా వేశమై సమిష్టిగానూ చర్చించి కలసి పని చేయా లని నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా ఎన్నికల లోనూ బీజేపీకి దాని అనుకూల పార్టీలకూ వ్యతిరేకం గా పోరాడాలని ప్రాథమికంగా అంగీకరించాయి. త్వరలోనే కాంగ్రెస్ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఏపీకి వస్తుండటం ఈ క్రమంలో భాగమే. షర్మిల కాంగ్రెస్ ప్రవేశం నాటి నుంచి కేవలం అన్నా చెల్లెళ్ల తగాదాగా చూపించడమే టీడీపీ అనుకూల మీడి యాలో ప్రధానంగా జరిగింది. మరో వైపున వైసీపీ అనుకూల మీడియా కూడా ఆమెను చంద్ర బాబు పథకం మేరకు పనిచేసే నేతగానే చిత్రించింది. అయితే కాంగ్రెస్ అధన్యక్షురాలుగా ఆమె టీడీపీతో కలసి వెళ్లడం కుదిరేపని కాదని అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ వేదికలో పాలుపంచు కుంటూ బీజేపీపై పోరాటంలో ముఖ్యపాత్ర వహించ వలసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ పని చేయడం సాధ్యం కాదనీ తెలుసు. నాటకీయమైన సంచలనాల కోసం మొదట్లో మీడియా అలాటి అంశాలపై కేంద్రీ కరించినా నెల గడిచేసరికి కాంగ్రెస్ నేతలు వామ పక్షాలతో కలసి మతతత్వ నిరంకుశ రాజకీయాలపై పోరాటంలో కలసిరాక తప్పలేదు. 20వ తేదీన విజయవాడలో జరిగిన సదస్సులో పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పాల్గొనడం, ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపి భవిష్యత్ ప్రణాళిక పంచుకోవడం సంభవించింది. ఈ విధంగా ఏపీలో ఒక కొత్త రాజకీయ కూటమికి రంగం సిద్ధమైంది. ఇదే సమ యంలో దేశవ్యాపితంగానూ ఇండియా భాగస్వాముల సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తుండడం గమనించ దగ్గది. కావాలని ఈ కూటమి పాత్రను తక్కువ చేసేం దుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. బీహార్‌లో అవకాశ వాద యూటర్న్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇండియా నుంచి వైదొలగడం పెద్ద పరిణామంగా ప్రచారమైంది. అదే సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను ఈడి అరెస్టు చేసి సంక్షోభం సృష్టించింది. ఆ ప్రభుత్వం కూలిపోతుందని బీహార్‌లోనూ ఎన్‌డిఎ పెరిగిపోతుందని అంచనా వేశారు. అయితే జరిగింది వేరు. బీహార్‌లో నితీశ్ ఒంటరిపాటై బీజేపీ చక్రబంధంలో చిక్కు కుపోగా ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ నిలదొక్కుకున్నారు. ఇండియా కూటమి బలంగా కొనసాగింది. ఇక జార్ఖండ్‌లో కొత్త ముఖ్యమంత్రి బలనిరూపణ చేసు కున్నారు. ఇవి బీజేపీ ఆశించిన దానికి భిన్నం. బీహార్ పరిణామాల తర్వాత ఇండియాకు ఊపుతగ్గిపోతుందనుకున్నారు. ఇండియా టుడేలో రాజ్‌దీప్ సర్దేశాయి, ఎన్‌డిటివిలో రాహుల్ కునాల్ వంటివారు అదే చిత్రణ ఇచ్చారు. కానీ ఆప్, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ వంటివి వాస్తవాలు గ్రహించి సర్దుబాటు దిశలో అడుగులు వేశారు. ఇప్పుడు చూస్తే ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలలోనూ ఆప్ 4, కాంగ్రెస్ 3 పోటీ చేయాలని అవగాహనకు వచ్చారు. ఆప్ బలం పెంచుకున్న గుజరాత్‌లోనూ ఇరు పార్టీలు కలసి వ్యవహరించాలని అంగీకారానికి వచ్చాయి. ఇక యూపీలో ఎస్‌పీ నేతలు కాంగ్రెస్‌ల మధ్య చెడిపోయినట్టేనని ఊదరగొట్టిన కథనాలు వెనక్కుపోయి 17 స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయిస్తూ అవగాహన కుదిరింది. రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర కు కూడా అఖిలేశ్ యాదవ్ హాజరయ్యారు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎస్‌పీకి ఒక సీటు ఇస్తున్నది. ఇది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితికి పూర్తిభిన్నం. కాకపోగా బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌తోనూ కాంగ్రెస్‌కు అవగాహన పెరిగిందని చెబతున్నా మళ్లీ తామే మొత్తం 42 పోటీ చేస్తామని వారి నాయకుడు వివేక్ డేబ్రియన్ చెబుతు న్నారు. సీపీఐ(ఎం) వరకూ తృణమూల్‌తో పొత్తు వద్దని పోరాటమే జరగాలని చెబుతున్నందున ఈ ప్రభావం పెద్ద లెక్కలోది కాదు. మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ ఎన్ని చీలికలు తెచ్చినా ఇండియా పార్టీలు సర్దుబాటు దిశలోనే వున్నాయి. హర్యానా, గోవాలలోనూ సర్దుబాట్లు జరగొచ్చు.
ఎదురు దెబ్బలతో కక్షసాధింపు
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్టకుతోడు దానికి తోడు తానే పెద్ద బీసీనంటూ బీసీవాదం తీసు కొచ్చారు. అంతకుముందు కాలంలో మండల్ వర్సెస్ కమండల్ అని బీజేపీని అపహాస్యం చేసేవారు. ఈ సారి అలా జరగకుండా తనే మండల్ కమండల్ కూడా తీసు కునేందుకు ప్రయత్నించింది. మార్కెట్ శక్తులను సంతోష పెట్టడం, ముస్లింలకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదన్న వాతావరణం కల్పించి తిప్పుకోవడం సంఘ పరివార్ ఎజెండాలో పెట్టుకుంది. అయితే వరుసగా జరిగిన పరిణామాలు ఆ ప్రయ త్నాలను వమ్ముచేశాయి. పైగా ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం నైతికంగా దెబ్బతీసింది. బరితెగించి ఆ తీర్పుకు బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఆమోదించకపోవడంతో వెనక్కు తగ్గింది. పులిమీద పుట్రలా చంఢఘీర్‌లో మేయర్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇవన్నీ భరించలేని మోడీ కృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇచ్చినా లంచం అంటారని చమత్కార వికారం చేశారు. దృష్టి మళ్లించడం కోసం కాంగ్రెస్ ఖాతాలు స్తంభింపచేయడం, ఏకపక్షంగా ఆదాయ పన్ను కింద రూ.67 కోట్లు విత్‌డ్రా చేయడం అన్నీ కక్ష సాధింపులే. కానీ ఈ సమయంలోనే రైతాంగ ఆందోళనపై కాల్పులలో ఒకరు మరణించడం విమర్శలకు దారితీసింది. మీడియా రాహుల్‌గాంధీకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని పెద్దది చేసి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తుంటే స్వయంగా మోడీనే వాటిని అందిపుచ్చుకుంటున్నారు. అయోధ్య మందిరం దగ్గర ఐశ్వర్యరారు, అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద వారికి తప్ప పేదలకు ప్రాధాన్యత లేదని రాహుల్ అంటే దాన్ని మహిళల కోణంలోకి మళ్లించారు. కర్నాటకలో ఆలయాలపై పన్ను వేశారనీ మరో దుమారం లేవదీశారు. కేరళ ప్రభుత్వంపైనా అనేక విధాలైన కతలు ప్రచారంలో పెట్టారు. ఈ ప్రచా రాలకు తోడు ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి సివిల్ కోడ్, అస్సాంలో ముస్లిం వ్యతిరేక శాసనాలు మత వివాదాలను పెంచే ప్రయత్నాలుగా మొదలైనవే. రాబోయే రోజులలో ఈ పోకడలు పెరిగేవే..
ఏపీ, తెలంగాణల్లో జరగాల్సింది..
ఇన్ని విధాలుగా రాజ్యాంగ వ్యతిరేక అప్రజా స్వామిక మతతత్వ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి, దానికి మద్ద తిచ్చే పార్టీలకూ వ్యతిరేకంగా పోరాడాలని వామపక్షాలు చర్యలు ప్రారంభించాయి. తెలంగాణ లోనూ ఒక లోక్‌సభ సీటులో పోటీ చేయాలనీ, మిగిలిన చోట్ల ఇండియా వేదిక భాగస్వాములకు మద్ద తివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్లీనం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై పోరాడాలని కూడా బి.వి.రాఘవులు సూచించారు. తమకు ఒక స్థానం కేటాయించాలని సీపీఐ నేత నారాయణ కూడా కోరారు.ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఓడించే పోరాటం తీవ్రం చేయలని ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపున మోడీపాలనపై పోరాడ వలసిందిపోయి బీజేపీకి వంతపాడటానికే సిద్ధమ య్యాయి. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు. ముఖ్య మంత్రి జగన్ పార్లమెంటులో వారి సభ్యులు ఎప్పుడూ బీజేపీ మద్దతునిస్తూ వచ్చారు. తెలుగుదేశం కూడా ఇందుకు భిన్నం కాదు. ఈ సారి ఎన్నికలలో జగన్‌ను ఓడించేందుకోసం బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయానికి వచ్చాయి. జనసేన ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా వుంది కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్‌షాతో చర్చలు జరిపి వచ్చారనీ, తమ మధ్య పొత్తు వుంటుందని ఈ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఏపీకి సంబం ధించినంతవరకూ ప్రత్యేకహోదా, అమరావతి, పోల వరం, విశాఖ ఉక్కు, లోటు భర్తీ వంటి అనేక విషయాల్లో మోడీ సర్కారు అన్యాయం చేయడం వారికి సమస్యగా కనిపించదు.అయితే ఈ విషయంలో బీజేపీ మాత్రం రకరకాలుగా మాట్లాడుతూ రాజకీయ చెలగాటమాడుతున్నది. తామెంత పాకులాడినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ రోజు జనసేన టీడీపీ ప్రధాన ఎన్నికల జాబితా ప్రకటించాయి.24 సీట్లలో జనసేన పోటీ అంటూ అయిదు సీట్లు ప్రక టించగా టీడీపీ 94 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే బీజేపీతో ఏదో చెలిమి కుదిరి పోయిందనే కథనాలపై ఉభయులూ ఇరురకాలుగా మాట్లాడటం విశేషం, బీజేపీ పెద్దల ఆశీస్సులతో తాము అవగాహనకు వచ్చామని పవన్ అంటే, ఆయన చెప్పినట్టు బీజేపీ పొత్తుకు వస్తే కొన్ని సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు అన్నారు. ఉభయులూ కేంద్రం గురించి పల్లెత్తు మాటనకుండా జగన్ సర్కారు తప్పిదాలపైనే ధ్వజ మెత్తారు. తమను ఇంత నిర్లక్ష్యం చేసిన బీజేపీతో పొత్తు గురించి ఈ నేతలు ఎలా మాట్టాడుతున్నారో అర్థం కాదు. ఈ రోజు కూడా బీజేపీ నేతలు పురందరేశ్వరి, జీవీఎల్ నరసింహా రావులు పొత్తుల విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.రాష్ట్ర దేశ ఎన్నికల చరిత్రలో పొత్తుల పేరిట ఇంత దయనీయ పరిస్తితిని ఏ పార్టీ ఎదుర్కొని వుండదేమో గానీ టీడీపీ జనసేన కోరి కోరి బీజేపీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొత్తం పైన మూడు ప్రాంతీయ పార్టీలూ మోడీ భజన చేస్తున్న సమయంలో ఏపీ ప్రజలు వారికి గుణపాఠం నేర్పవలసిన అగత్యమేర్పడింది. తెలంగాణలోనూ బీఆర్‌ఎస్, బీజేపీకి అనుకూలమనే ప్రచారం తిరస్కరణకు దారితీసింది. మరి ఈ సమయంలోనైనా వారు మతరాజకీయాలకు వ్యతిరేకంగా కచ్చితంగా ముందుకు రావడం లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తమ మధ్య తగాడాలలో మునిగితేలుతూ బీజేపీపౖౖె పోరాటం అవసరాన్ని విస్మరిస్తున్నాయి. దాన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ ఎంఎల్‌సి కవితకు సీబీఐ నోటీసులు పంపడం, కాంగ్రెస్ నేతలపై దాడులు వంటి పనులు చేయిస్తున్నది.విభజన సమ స్యల పరిష్కారం చేయకుండా తగాదాలు పెంచుతు న్నది. దేశవ్యాపితంగా లౌకిక పార్టీలు ఇండియా వేదికపై కలసిపోరాడుతున్న తీరు తెలుగురాష్ట్రాల్లోనూ శక్తివంతంగా అమలు చేయవలసి వుంది. తాజా పరిణామాలు ఆ విధమైన ఆశాభావం కలిగిస్తున్నాయి. హెచ్చరికా చేస్తున్నాయి.
తెలకపల్లి రవి