ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు?

 ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు?1. 360వ నిబంధన ద్వారా ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని పేర్కొన్నది.
1. బాబు రాజేంద్రప్రసాద్‌ 2. అంబేద్కర్‌
3. కె.టి. షా 4. బి.ఎన్‌. రావు
2. ఇటీవల రెండవ రక్షణ దళాల అధిపతిగా ఎవరు నియామకం అయ్యారు?
1. జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ 2. కంబీర్‌ సింగ్‌
3. మనోజ్‌ ముకుంద్‌ నరావనే 4. ఎవరూ కాదు
3. మిత్రదేశాలకు రాయబారులను నియమించేది ఎవరు?
1. విదేశీ వ్యవహారాల మంత్రి 2. రక్షణశాఖ మంత్రి
3. రాష్ట్రపతి 4. ప్రధానమంత్రి
4. క్రిందివాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని రాజ్‌నారాయణ్‌ పిటిషన్‌ వేశారు
బి. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన అలహా బాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్‌లాల్‌ సిన్హా
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ, బి 4. ఏదీకాదు
5. 28వ భారత సైనిక దళాధిపతి ఎవరు?
1. బిపిన్‌ రావత్‌ 2. అనిల్‌ చౌహాన్‌
3. విఆర్‌ చౌదరి 4. మనోజ్‌ పాండే
6. క్రింది ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.
1. 222 2. 124(2) 3. 217(1) 4. 155
7. బ్యాంకింగ్‌ సర్వీసు బిల్లు విషయమై పార్లమెంట్‌ సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేసిన రాష్ట్రపతి ఎవరు?
1. కెఆర్‌ నారాయణ్‌ 2. ఆర్‌. వెంకట్రామన్‌
3. రాజేంద్రప్రసాద్‌ 4. నీలం సంజీవరెడ్డి
8. పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశమునకు అధ్యక్షత వహించడానికి స్పీకర్‌ అందుబాటులో లేకపోతే అధ్యక్షత వహించేది ఎవరు?
1. రాష్ట్రపతి 2. డిప్యూటీ స్పీకర్‌
3. ప్రధానమంత్రి 4. పై ఎవరైనా
9. అటల్‌ బిహారి వాజ్‌పేరు క్రింది ఏ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు?
1. బ్యాంకింగ్‌ సర్వీసు బిల్లు 1978
2. ఉగ్రవాద నిరోధక చట్టం 2002
3. వరకట్న నిషేధ చట్టం 1961
4. పై అన్నీ
10. 27వ వాయు దళపతి ఎవరు?
1. అనిల్‌ చౌహాన్‌ 2. మనోజ్‌ ముకుంద్‌ నరవనే
3. వివేక్‌ రారు చౌదరి 4. కరంబీర్‌ సింగ్‌
11. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాల నుండి మూడున్నర సంవత్సరాలకు పొడిగించారు.
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 68 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 67 రాజ్యాంగ సవరణ చట్టం
12. మద్యపాన నిషేధ చట్టం అమలులో అల్లర్లకు గాను ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ సమయంలో గవర్నర్‌ ఎవరు?
1. భీంసేన్‌ సచార్‌ 2. ఎస్‌ఎం శ్రీ నగేష్‌
3. సిఎం త్రివేది 4. పిఎ థానుపిల్లై
13. భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు?
1. 217(1) 2.123 3.124(2) 4.155
14. భారత రాష్ట్రపతి ఈక్రింది ఏ వీటో అధికారం కలిగి ఉండరు.
1. సస్పెన్సివ్‌ వీటో 2. అబ్సల్యుట్‌ వీటో
3. పాకెట్‌ వీటో 4. క్వాలిఫైడ్‌ వీటో
15. ”పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశం” ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. అమెరికా 2. బ్రిటన్‌
3. ఆస్ట్రేలియా 4. దక్షిణాఫ్రికా
16. బడ్జెట్‌ సమావేశాలను ఎవరు ప్రారంభిస్తారు?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ఆర్థికశాఖమంత్రి 4. స్పీకర్‌
17. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మూడున్నర సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు పొడిగించారు.
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 67 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 68 రాజ్యాంగ సవరణ చట్టం
18. రాష్ట్రపతి పాలనను అధికసార్లు విధించిన రాష్ట్రాలు ఏవి?
ఎ. హర్యానా బి. జార్ఖండ్‌
సి. కేరళ డి. ఉత్తరప్రదేశ్‌
1. ఎ, బి 2. బి, సి
3. సి, డి 4. ఎ, డి
19. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ను నియమించునది?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. హౌంశాఖ
4. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
20. షెడ్యూల్‌ మరియు ఆదివాసి ప్రాంతాలను ప్రకటించేది?
1. లోక్‌సభ 2. పార్లమెంట్‌
3. రాష్ట్రపతి 4. ూజ, ూు కమీషన్‌ ఛైర్మన్‌
21. క్రింది వాటిలో సరైనది గుర్తించండి.
1. రెండోసారి గవర్నర్‌ పంపిన బిల్లులని రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి
2. పార్లమెంట్‌ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి రెండవసారి తప్పకసారి ఆమోదించాలి
3. 1, 2 4. ఏదీకాదు
22. పార్లమెంట్‌ అనగా?
1. రాజ్యసభ 2. లోక్‌సభ
3. రాష్ట్రపతి 4. పైవన్నీ
23. భారత రాజ్యాంగానికి లోబడి యుద్ధం లేదా శాంతిని ప్రకటించే అధికారం ఎవరికి కలదు.
1. రక్షణశాఖ మంత్రి 2. రాష్ట్రపతి
3. ప్రధానమంత్రి 4. పార్లమెంట్‌
24. భారత రాష్ట్రపతికి ఈ క్రింది ఏ సమావేశ ప్రారంభంలో ఉభయసభలలో ప్రసంగించే అధికారం కలదు.
1. సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశం
2. బడ్జెట్‌ సమావేశాలు
3. 1,2 4. ఏదీకాదు
25. అమరజవానులకు తోడ్పాటును అందించే లక్ష్యంతో రూపొందించిన భారత్‌ కే వీర్‌ అధికారిక గీతాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
1. 2022 2. 2020
3.2018 4. 2019
26. మిత్రదేశముల నుండి వచ్చిన రాయబారుల నుండి నియామక పత్రములను సేకరించి క్రమబద్ధం చేయువారు?
1. విదేశీ వ్యవహారాల మంత్రి 2. పార్లమెంట్‌
3. ప్రధానమంత్రి 4. రాష్ట్రపతి
27. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసినపుడు దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరు?
1. జాకీర్‌ హుస్సేన్‌ 2. సర్వేపల్లి రాధాకృష్ణ
3. వివి గిరి 4. ఫకృద్దీన్‌ అలీ
28. భారత రాజ్యాంగంలోని 267(1) ప్రకారం భారత అఘంతుకపు విధి ఎవరి ఆధీనంలో ఉంటుంది.
1. హోంశాఖ 2. ప్రధానమంత్రి
3. రాష్ట్రపతి 4. పై ఎవరూ కాదు
29. ఈకింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను నాలుగు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పొడిగించారు?
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 67 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 68 రాజ్యాంగ సవరణ చట్టం
30. ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు?
1. సిఎం త్రివేది 2. కెకె దేశారు
3. ఎస్‌ఎం శ్రీ నగేష్‌ 4. భీంసేన్‌ సచార్‌
31. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఉభయసభలు ప్రత్యేక మెజార్టీతో ఎంత కాలం లోపు ఆమోదించాలి.
1.2 నెలలు 2. 1 నెల
3. 6 నెలలు 4. 6 వారాలు
32. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుండా సస్పెన్షన్‌లో ఉండాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. షంశేర్‌ Vర పంజాబ్‌ 2. మినర్వామిల్స్‌ కేసు
3. డిసి వాద్వా Vర బీహార్‌
4. యస్‌.ఆర్‌.బొమ్మాయికేసు
33. అత్యవసర అధికారాల వలన రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన నియంతగా వ్యవహరించవచ్చు అని విమర్శించినది.
1.కె.టి.షా 2. యస్‌.ఎల్‌.సక్సేనా
3. ఎ.జి.హీల్‌ 4. టి.టి.కృష్ణమాచారి
34. భారత రాజ్యాంగాన్ని పతనపు అంచుల నుండి కాపాడే మృత సంజీవని లాంటిది అని అత్యవసర పరిస్థితిని అభివర్ణించినవారు.
1.అంబేద్కర్‌ 2. గోపాలసామి అయ్యంగార్‌
3. మహావీర్‌ త్యాగి 4. హెచ్‌.వి. కామత్‌
35. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2వ సారి రాష్ట్రపతిపాలన విధించినపుడు రాష్ట్రపతి ఎవరు.
1. ప్రతిభాపాటిల్‌ 2. అబ్దుల్‌కలాం
3. రామ్‌నాథ్‌ కోవింద్‌ 4. ప్రణబ్‌ ముఖర్జీ
36. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి.
ఎ. రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్రపతి ఏజెంట్‌గా రాష్ట్ర గవర్నర్‌ నిజమైన కార్యనిర్వహణ అధికారాలను చెలాయిస్తారు.
బి. హైకోర్లు అధికారాలను రద్దు చేస్తారు.
1.బి మాత్రమే 2. ఎ,బి
3. ఎ మాత్రమే 4. ఏదికాదు.
37.రాష్ట్రపతి పాలన ఆరు నెలల తర్వార కొనసాగాలంటే పార్లమెంటు ఒక తీర్మానం ప్రకారం ఆరు నెలల చొప్పున గరిష్టంగా ఎంత కాలం పొడిగించవచ్చును.
1.1సం. 2. 2 సం.లు
3.3 సం.లు 4. ఎంత కాలం అయినా
38. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత పార్లమెంటరీ చట్టాలు ఎంత కాలం కొనసాగుతాయి?
1.1 నెల 2. 1 సం. 3. 3 నెలలు
4. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన 6 నెలల వరకు
39. కింది ఏనిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే ఆ చట్టాలు ఇంతకు పూర్వం రాష్ట్ర చట్టంలతో వ్యతిరేకమయితే ఆ వ్యతిరేకము మేరకు పార్లమెంటు చట్టాలే అమలులోకి వస్తాయి.
1.253 2. 239 3. 251 4. 330
40.లోక్‌సభ సమావేశంలో లేనపుడు 1/10 వంతు లోక్‌సభ సభ్యులు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు తీర్మానాన్ని రాష్ట్రపతికి తెలియజేసిన రాష్ట్రపతి ఎంత కాలం లోపు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలి.
1.30 రోజులు 2. 14 రోజులు
3. 10 రోజులు 4. 15 రోజులు
41. అంతర్జాతీయ వ్యవహారములలో పాల్గొనుటకు ప్రతినిధి బృందమును ఎవరు నియామకం చేస్తారు?
1.ప్రధానమంత్రి 2. రక్షణశాఖమంత్రి
3. విదేశీ వ్యవహారాల మంత్రి 4. రాష్ట్రపతి
42. తొలి రక్షణ దళాల అధిపతిగా ఎవరు నియామకం అయ్యారు.
1 బిపిన్‌ రావత్‌ 2. కరంబీక్‌ సింగ్‌
3. వి.ఆర్‌. చౌదరి 4. ఎవరూ కాదు.
43. ఎ. ఆర్టికల్‌ 155 1. ఎస్‌.టి కమీషన్‌
బి. ఆర్టికల్‌ 338 2. యుపిఎస్‌సి చైర్మన్‌
సి. ఆర్టికల్‌ 316 3. రాష్ట్ర గవర్నర్లు
డి. ఆర్టికల్‌ 324 4. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ Ê ఇద్దరు అదనపు కమీషనర్లు
1. ఎ2, బి3, సి4, డి1 2. ఎ1, బి2, సి3, డి4
3. ఎ3, బి1, సి4, డి2 4. ఎ3, బి1, సి2, డి4
44. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పాక్షికంగా న్యాయసమీక్షకు గురి అవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. యస్‌.ఆర్‌.బొమ్మాయి కేసు 2. శంశేర్‌ Vర బీహార్‌
3. ఈడ్పు శ్రీధర్‌ Vర వెంకట్‌ రెడ్డి 4. ఏది కాదు.
45. ఒక ప్రత్యేక కారణం దృష్ట్యా శిక్ష అమలును వాయిదా వేయడం, తగ్గించడం, మరో రకంగా మార్చడాన్ని ఈ విధంగా పిలుస్తారు?
1. రిఫ్రైన్‌ 2. పారడన్‌
3. రెస్పైట్‌ 4. రెమిషన్‌
46. ఇప్పటి వరకు భారత రాష్ట్రపతులలో అత్యధిక సార్లు సుప్రీంకోర్టు న్యాయసలహా తీసుకున్న రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ ఎన్నిసార్లు తీసుకున్నారు?
1. 1 2.2 3.3 4.4
47. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగింది ”సాయుధ తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు?
1. 64వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
48. జాతీయ అత్యవసర పరిస్థితి అధికారాలు మన రాజ్యాంగానికి నివాసపు చేటు తెచ్చేవిగా ఉన్నాయి అని విమర్శించిన వారు?
1. కె.టి.షా 2. యస్‌.ఎల్‌.సక్సేనా
3. ఎ.జి.హీల్‌ 4. టి.టి.కృష్ణమాచారి
49. రాష్ట్రపతి పాలన ఎక్కువ రోజులు ఏ రాష్ట్రంలో విధించారు?
1.కేరళ 2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్‌ 4. పంజాబ్‌
50. రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా మూడు బాధ్యతలను నిర్వహించిన ఏకైక వ్యక్తి.
1. ఫక్రుద్దీన్‌ అలీ 2. వి.వి.గిరి
3. జ్ఞాని జైల్‌సింగ్‌ 4. అబ్దుల్‌కలాం
సమాధానాలు
1.2 2.1 3.3 4.3 5.4
6.2 7.4 8.2 9.4 10.3
11.3 12.3 13.1 14.4 15.3
16.2 17.2 18.3 19.2 20.3
21.2 22.4 23.2 24.3 25.3
26.4 27.3 28.3 29.4 30.2
31.2 32.4 33.4 34.2 35.4
36.1 37.3 38.4 39.3 40.2
41.4 42.1 43.4 44.3 45.3
46.3 47.3 48.1 49.4 50.2
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు 9494228002

Spread the love