పంచాయితీ రాజ్‌ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

పంచాయితీ రాజ్‌ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?1. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 సం.లోపు బాలబాలికలకు బాల బడి విద్య అందించాలి అనే అంశాన్ని చేర్చారు?
1. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
2.83వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
4. పై ఏది కాదు.
2. భారత రాజ్యాంగంలో క్రింది ఏ ఆర్టికల్‌ పేదలకు ఉచిత న్యాయ సలహా పద్ధతిని అందించాలని పేర్కొంటుంది?
1. 51 2. 43(ఎ)
3. 39(ఎ) 4. 39(ఎఫ్‌)
3. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?
1. 7వ భాగం 2. 5వ భాగం
3. 3వ భాగం 4. 4వ భాగం
4. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏదేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము.
1. బ్రిటిషు రాజ్యాంగం 2. కెనడా రాజ్యాంగం
3. ఐర్లాండ్‌ రాజ్యాంగం
4. జపాన్‌ రాజ్యాంగం
5. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ ప్రకారం ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు?
1. 36 2. 44
3. 37 4. 42
6. జతపరుచుము. ఆర్టికల్స్‌ – వివరణ
ఎ.39 (సి) 1. ప్రజలందరికి జీవన భృతిని కల్పించాలి.
బి.39 (ఎ) 2. స్త్రీ పురుష తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం కల్పించుట.
సి.39(డి) 3. సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండుట.
డి.48(ఎ) 4. పర్యావరణ పరిరక్షణకు గాను అడవులను అడవి జంతువులను సంరక్షించాలి.
1. ఎ3, బి1, సి4, డి2 2. ఎ3, బి1, సి2, డి4
3. ఎ4, బి1, సి4, డి3 4. ఎ3, బి4, సి1, డి2
7. సమాన పనికి సమాన వేతనం అను పదం ఒక
1. రాజ్యాంగ హక్కు 2. ప్రాథమిక హక్కు
3.ఆదేశిక సూత్రం 4. పై ఏది కాదు.
8. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
1. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వర్గీకరణ ప్రస్తావన లేదు.
2. ఆదేశిక సూత్రాల అమలు కోసం వ్యక్తులు ఎవరైన ఉన్న న్యాయస్థానాలకు సంప్రదించరాదు.
3.వీటి అమలు కోసం న్యాయస్థానాలు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయవచ్చును.
1. 1 మరియు 3 2. 2 మరియు 3
3.1,2,3 4. 1 మరియు 2
9. యం.పి. శర్మ, యం.ఎన్‌. జోషి ఆదేశిక సూత్రాలను వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరణకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. సామ్యవాద నిబంధనలు
2. ఉదారవాద నిబంధనలు
3. న్యాయ సంబంధ నిబంధనలు
4 .గాంధేయవాద నిబంధనలు
1. 1,2,3 2. 1,4,3
3.1,2,4 4.1,2,3,4
10. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను న్యాయ సాధ్యతను ఆధారం చేసుకొని మూడు రకాలుగా విభజన చేసిన వారు ఎవరు?
1. దుర్గాదాస్‌ బసు 2. జైన్‌
3. దీక్షిత్‌ 4. యం.ఎన్‌.జోషి
11. ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదని ప్రజలు న్యాయ స్థానాలను ఆశ్రయించరాదని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. దేవదాసన్‌ Vర ఖఉ×
2. చంపకం దొరై Vర మద్రాస్‌ రాష్ట్రం
3. ఇనాందార్‌ Vర మహారాష్ట్ర
4. ఏదికాదు.
12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(బి) 39(సి) అమలు కోసం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవచ్చును అనే అంశాన్ని క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
1. 93వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 23 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 25 వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 83 వ రాజ్యాంగ సవరణ చట్టం
13. భారత రాజ్యాంగంలో క్రింది ఏ ఆర్టికల్‌ బాల బాలికలు, యువతి యువకులు దుర్వ్యసనాలకు లోనుకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొంటుంది.
1. 39(ఇ) 2. 39(ఎఫ్‌)
3. 39(డి) 4. 39(ఎ)
14. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను పొందుపరచడంలో మూడు నివేదికలు ఎక్కువగా తోడ్పడ్డాయి. అయితే అంతిమంగా ఏ నివేధిక ప్రకారం ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు.
1. కరాచి సమేశ తీర్మానం 1931
2. నెహ్రూ రిపోర్టు 1928
3. సప్రూరిపోర్టు 1945 4. పై ఏది కాదు.
15. రాజ్యాంగ పరిషత్‌లోని ముసాయిదా కమిటీ ఆదేశిక సూత్రాలను ఎన్ని డ్రాప్టులలో పొందుపరిచింది.
1. 4 2. 3 3. 2 4. 5
16. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో క్రింద ఏ అధికరణ ‘రాజ్యం’ గురించి నిర్వచిస్తుంది.
1. 37 2. 48 3. 38 4. 36
17. క్రింది వాటిలో సరికానిదానిని గుర్తించండి.
1. బాల కార్మిక నిషేద చట్టం 1986
2. వెట్టిచాకిరి నిషేద చట్టం 1987
3. బ్యాంకుల జాతీయికరణ 1969
4. మహిళల కోసం సమాన వేతన చట్టం 1976.
18. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అంతర్జాతీయ శాంతిని నెలకొల్పాలని పేర్కొంటుంది?
1. 47 2. 49 3. 50 4. 51
19. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి అంతరాత్మ లాంటివి అని అభివర్ణించిన వారు ఎవరు?
1. గ్రాన్విల్‌ ఆస్టిన్‌ 2. కె.టి.షా
3. బి.ఎన్‌. రావ్‌ 4. అంబేద్కర్‌
20. రాజ్యాంగంలోని 49వ నిబంధన దేనిని తెలుపుతుంది?
1. పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగ స్వామ్యం కల్పించడం.
2. గోవధను నిషేదించడం
3. కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించడం
4. పురాతన కట్టడాల, శిల్ప సంపదను సంరక్షించుట.
21. ”ఆదేశిక సూత్రాలను భారత ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తే భారతదేశం భూలోక స్వర్గమౌతుందని ” అభివర్ణించిన వారు.
1. యం.సి.సెటల్వాడ్‌ 2. గజేంద్రగట్కర్‌
3. యం.సి. చాగ్లా 4. బి.ఎన్‌.రావు
22. భారత దేశంలో ఉమ్మడి పౌరస్మృతి గల ఏకైక రాష్ట్రం ఏది?
1. గోవా 2. చండీఘర్‌
3. అస్సాం 4. ఝార్ఖండ్‌
23. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం గోవధ నివారణ, పశువుల సంరక్షణ బిల్లు 2020 ను ఆమోదించింది?
1. ఉత్తరప్రదేశ్‌ 2. కర్ణాటక
3. కేరళ 4. మణిపూర్‌
24. భారత రాజ్యాంగంలో 43వ నిబంధనకు సంబంధించి కింది వాక్యాలను సరి కాని వాటిని గుర్తించండి.
1. కార్మికులకు కనీస పని గంటలు
2. పంచాయితీ రాజ్‌ సంస్థలను ఏర్పాటు చేయడం.
3. కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం.
4. యస్‌.సి, యస్‌.టి వర్గాల వారి సామాజిక ,విద్యా, ఆర్ధిక అభ్యన్నతికి ప్రభుత్వాలు కృషి చేయడం.
1. 3 మరియు 4 2. 2 మరియు 4
3. 1,2,3,4 4. 2,3,4
25. భారత దేశంలో పంచాయితీ రాజ్‌ వ్యవస్థను ఏ సం.లో ప్రవేశపెట్టారు?
1. 1993 2. 1992
3. 1959 4. ఏది కాదు.
26. ఆదేశిక సూత్రాలు లక్ష్యాలు – ఆశయాల తీర్మానంకు మ్యానిఫెస్టో లాంటివి అని అభివర్ణించిన వారు.
1. కె.సి.వేర్‌ 2. యం.సి.సెటల్వాడ్‌
3. ఐవర్‌ జెన్నింగ్స్‌ 4. నసిరుద్దీన్‌
27. ఆదేశిక సూత్రాలను ముసాయిదా కమిటీ డ్రాప్టులలో రూపొందించింది అయితే మొదటి డ్రాప్టు ఎప్పుడు రూపొందించింది?
1. 26 నవంబరు 1949
2. 26 జులై 1949
3. 21 ఫిబ్రవరి 1948
4. 17 అక్టోబరు 1948
28. భారతదేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ను అమలు చేయాలని సుప్రీంకోర్టు క్రింద ఏ కేసు / కేసులలో తీర్పునిచ్చింది.
1. జాన్‌ వల్ల మోతన్‌ 2003
2. షాబానుకేసు 1985
3. సరళాముద్గల్‌ 1995 4. పైవన్నీ
29. భారతరాజ్యాంగంలో కింది ఏ అధికరణ స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయడంలో భాగంగా పంచాయితీ రాజ్‌ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నది.
1. 41 2. 40
3. 39ఎ 4. పై ఏది కాదు.
30. కింది ఏ కేసులో సుప్రీంకోర్టు కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి మాండమస్‌ అనే రిట్‌ ను జారీ చేయడం వీలుకాదని స్పష్టం చేసింది.
1. మహార్షి అవదేష్‌ Vర ఖఉ×
2. బాన్సిలాల్‌ పాటిల్‌ Vర ఏ.పి
3. సిద్దాస్‌ Vర ఢిల్లీ 4. పైవన్నీ
31. తలాక్‌ అనే పదాన్ని మూడు సార్లు వాడితే 3 సం. కఠిన కారాగార శిక్ష విధించే బిల్లు పై రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు?
1. 4.8.2019 2. 1.8.2019
3. 30.7.2019 4. 25.7.2019
32. భారత రాజ్యాంగంలోని ఈ కింది ఏ అధికరణ కార్మికులకు మానసిక శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొంటుంది?
1. 40 2. 43 3. 45 4. 46
33. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య ఘర్షణను ఐదు దశలుగా విభజించినవారు?
1. జె.ఆర్‌.శివాక్‌ 2. గ్రాన్విల్‌ ఆస్టిన్‌
3. ఐవర్‌ జెన్నింగ్స్‌ 4. యం.సి.సెటల్వాడ్‌
34. ఆదేశిక సూత్రాలు చెత్త బుట్టకే పరిమితమైన ప్రజల భావోద్వేగాలు అని అభివర్ణించినవారు.
1. నసీరుద్దీన్‌ 2. అంబేద్కర్‌
3. యం.సి. చాగ్లా 4.టి.టి.కృష్ణమాచారి
సమాధానాలు
1.3 2.4 3.4 4.3 5.3
6.2 7.3 8.4 9.3 10.1
11.2 12.3 13.2 14.3 15.2
16.4 17.2 18.4 19.1 20.4
21.3 22.1 23.2 24.2 25.3
26.1 27.3 28.4 29.2 30.1 31.2 32.2 33.1 34.4
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు 

Spread the love