కొత్త జిల్లాలతో ప్రజలకు ఒరిగిందేమిటి?

కొత్త జిల్లాలతో ప్రజలకు ఒరిగిందేమిటి?”పాత ఒక రోత.. కొత్త ఒక వింత” అనే నానుడికి తెలంగాణ పాలన అద్దం పడుతోందా? అంటే అవుననే చెప్పక తప్పదు. మనము.. మన తాతలు.. ముత్తాతలు.. ముత్తాతల తాతల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఎదురు చూడగా ఎందరో అమర వీరులు, పోరాటయోధులు, తెలంగాణ వాదులు, పలు రాజకీయ పార్టీనాయకుల కృషితో స్వరాష్ట్రం సిద్ధించింది. దాదాపు స్వరాష్ట్రంలో పదేండ్లుగా వింతలు.. విడ్డూరాలు తప్ప కొత్తగా సాధించిం దేమీ లేదు. బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీఎం అయ్యి రెండు దఫాలు సీఎం పదవిలో ఉన్నా తెలంగాణ ప్రజలు ఆశిం చినస్థాయిలో అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పాటైన తెలంగాణ పాలన గాడితప్పి కొత్త నిర్ణయాలు, కొత్త పథ కాలు, జిల్లాల పునర్విభజనతో తెలంగాణ మొత్తం ఓ కొత్త ప్రపంచంలోకి పాలకులు తీసుకెళ్లారు. ప్రజలూ ఏదో జరుగుతోంది, మార్పు వస్తోందంటూ లొట్టలేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సెంటిమెంట్‌ తో బీఆర్‌ఎస్‌ పాలన సాగించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందంటూ ఉప న్యాసాలతో గత పాలకులు ఊదరగొ ట్టారు. ప్రజాఅభివృద్ధి విస్మరించి వారి రాజకీయ పాలన సులభతరం కోసం, ఓటు బ్యాంకింగ్‌ పెంచుకోవడం కోసం చేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ.. కావు. పాలకుల మాయలో పడిన తెలంగాణ జనం కూడా గోబెల్‌ ప్రచారంలో చిక్కు కుని అదే నిజమని కలల్లోనే కాలం వెళ్లదీశారు. ఇక మూడో దఫాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి సీఎం పదవిని చేజిక్కించుకున్న రేవంత్‌రెడ్డి కూడా తనదైన శైలిలో పాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, పాత పాలన మాదిరి గానే కొత్త పథకాలు కొత పేర్లతో పాలన సాగిస్తున్నారు. వీటితో బడుగులకు ఏ మేర న్యాయం జరుగుతుందనేది పక్కన బెడితే.. కొత్తగా జిల్లాల కుదింపు ప్రక్రి యను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలకు పాలన మరింత సులభతరంగా చేరువ య్యేందుకు జిల్లాల పునరేకీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో జనాలు పడ్డ బాధలు వర్ణణాతీతం. కొందరికి పాలన చేరువైతే మరికొందరికి దూరభారం తప్పలేదు. కనీసం బస్సు సౌక ర్యం కూడా లేని గ్రామాల వారు వారి సమస్యలను విన్నవిం చేందుకు పడ్డపాట్లు అంతా ఇంతా కాదు. అసలు చిన్న జిల్లా లు.. పెద్ద జిల్లాలుగా ఉంటే వచ్చే సమస్యలు ఏంటనేవి సునిశితంగా శాస్త్రీయబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి. కానీ, పాలకులకు గవేం కనబడని దుస్థితి నెలకొం ది. పాలన.. అంటే రాజకీయాలకే అన్నట్టు అయిపోతోంది.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పునర్‌ వ్యవస్తీకరణ చట్టం-1974 ప్రకారం తొలుత పాత 10 జిల్లాలకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేయగా మొత్తం 33 జిల్లాలు తెలం గాణలో ఉన్నాయి. అయితే జిల్లాల పునరేకీకరణతో కొన్ని ప్రాంతాల రూపు రేఖలే మారిపోయాయి. సమీకృత కలె క్టరేట్లు, పోలీస్‌ కార్యాలయాలు, తదితర ప్రభుత్వ కార్యాల యాలు అందుబాటులో కొచ్చినా సమస్యలు మాత్రం పరిష్కా రం కాని పరిస్థితి. ఇక ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల ప్రజల బాధలు వర్ణణాతీతం. మారు మూల ప్రాంతాలకు సత్వర సేవలు, సత్వరం సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే నిరాశే మిగిలింది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 459 మండలాలలను 612 మండలాలు గా, 8368 గ్రామపంచాయతీలను 12769 గ్రామ పంచాయతీలు పునర్‌వ్యవస్థీకరించారు. ఇక 52 మున్సిపాల్టీలుండగా 128 మున్సిపాలి టీలుగా, ఆరు కార్పొరేషన్లు ఉండగా 13 కార్పొ రేషన్లుగా ఏర్పాటు చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 141 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇకపోతే హైకోర్టు విభజన, జడ్జిల నియామకం, అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చేరువయ్యేందుకు చేసిన మార్పులతో జనానికి ఏ మేరకు న్యాయం జరిగిందనేది పక్కన బెడితే సమస్యలు మాత్రం అపరిష్కృతంగా పేరుకుపోయాయి. ఈక్రమంలోనే బీఆర్‌ఎస్‌ ఓటమి తరువాత అధి కారంలోకొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం పునర్విచారణ చేస్తామని ఇటీ వల ప్రకటించడం చర్చనీయాంశం గా మారింది. ఏకంగా రిటైర్డ్‌ జడ్జి తో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణ యం తీసుకుంటామని ప్రటించా రు. ఇక తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా తక్కువ జిల్లాలను పాత జిల్లాల్లోనే కలిపేసేందుకు సిధ్దమవుతున్నట్టు తెలస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటివరకు పాలకులు తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనే ప్రశ్న తలెత్తక మా నదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన మార్పులు.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో ప్రజలకు ఏమేర న్యాయం చేకూరుస్తుందనేదే ముఖ్యం. లేదంటే పాత సీసాలో కొత్త సారాయి అన్న చందం గా రాష్ట్రపాలన సాగితే ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్ప ఒరిగేదేమీ ఉండదు. గత పాలనలోని అవినీతి అక్రమాలు, నెలకొన్న సమస్యలను వెలికితీసి పరిష్కరించి ఆర్థిక మెరుగు దలకు పాల్పడడం ప్రథమ కర్తవ్యంగా చేయాలి. అప్పుడే ప్రజా పాలనకు ఓ అర్థం ఉంటుంది. ఈసారైనా రాష్ట్రంలో మార్పులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
వేముల క్రాంతికుమార్‌
9676717377

Spread the love