దళితులు ఓట్లకే పరిమితమా?

దళితులు ఓట్లకే పరిమితమా?రాష్ట్రంలో దళితు లు ఏండ్లుగా అనేక సమస్యలతో ఇబ్బం దులు పడుతున్నారు, అయినా ప్రభుత్వాలు దళితుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడం లో పూర్తిగా విఫలమయ్యాయి, సామాజిక ఆర్దిక సమస్యలతో బాధపడుతున్నారు, ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయి, పాల కులు సమస్యలు పట్టించుకోకపోవడం వివక్ష కదా? దళితులకు ఓట్లు వున్నాయి. అవి అన్ని రాజకీయ పార్టీలకు కావాలి. పార్టీలు అనేక పథ కాలు, వలగా వేసి దళితుల్ని ఆకర్షించడానికి తరుచు పోటీ పడుతున్నాయి. కనీసం దళితుల మౌళిక సమస్యల్ని పరిష్కరించాలని ఏ రాజ కీయ పార్టీ అనుకోవడంలేదు. ఇది వాస్తవం? ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలో డిసైడ్‌ చేసే శక్తుల్లో దళిత సమాజం కూడా ఒకటి. కానీ అలాంటి వారిమీదే తరతరాలుగా వివక్ష ఉంటూనే ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయ కులు వచ్చిన, దళితుల మీద జరిగే అరాచకా లకు సమస్యలకు పరిష్కారం లభించలేదు. కొత్త ప్రభుత్వాలు దళితులకు ఎన్ని హామీలిస్తున్నా సమస్యలు అమలు నోచుకోలేక నిత్యం పోరు బాట పడుతున్న దళిత సంఘాలు, దశాబ్దాలుగా దళితుల అన్యాయం జరుగుతూనే ఉంది.
దళితులు ప్రస్తుతం స్వతంత్రంగా పోరా టం చేయటంకంటే, సమిష్టి పోరాటం చేయ టం ద్వారానే నిజమైన విముక్తి లభిస్తుందనే దక్పథంతో మేధావి వర్గంలో ఆలోచన మొద లైంది, ఎస్సీలలో జనాభాలో తాజా సర్వేలో 17.50 శాతమని తేలింది. మొత్తం ఎస్సీల జానాభా 63,60,158 (17.50శాతం). ఉన్నప్పటికి చిన్న చిన్న సమూహలుగా ఉండడం వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల సమాజంలో అత్యంత అవమానాలకు వివక్షకు గురివుతున్నారు. దళితులకున్న ఓటు హక్కును గుర్తించిన రాజకీయ పార్టీలు, దళితులలో దళారీలను ప్రోత్స హించాయి. కానీ దళితులకు ఒరిగేదేం లేదు ఎన్నికలనాడు ఓటు వేయించుకుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకూ ఆ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అంటరానితనాన్ని రూపు మాపాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఉద్య మించగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దళితులను కేవలం ఓటుబ్యాంక్‌గా చూస్తూ, కులాల కుంప ట్లు రగిల్చి పబ్బం గడుపుకునే స్వార్ధ రాజకీయా లు స్వైర విహారం చేస్తున్నారు. ఆందోళనకర పరిస్థితుల్లో దళితులకు భూమిపై హక్కు లేదు. కటిక దారిద్య్రంలో మగ్గుతున్నారు. సగటు మా నవాభివృద్ధి సూచీలన్నింటా వారిది అట్టడుగు స్థానమే. దేశంలో అందరికంటే వారు దైన్య స్థితిలో ఉన్నారంటే పాలకులు వైఫల్యానికి కార ణాలు, 76 సంవత్సరాల సరళీకరణ విధానాలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ప్రశ్నార్ధకం చేశాయి. అంతకంతకూ ప్రభుత్వ రంగం కుదిం చుకుపోతుండటంతో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కాక ఉపాధి అవకాశాలు దిగజారుతు న్నాయి. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ నియామకాలు చేపట్టడంతో దళితు లకు రాజ్యాంగం నిర్ధేశించిన కోటాలో ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
ఆర్థిక విషయాలకే ప్రాధాన్యతనిచ్చి రాజ కీయ పార్టీలు ఆకర్షణలకు దిగాయి. ఇందుకు భాగంగానే భూములివ్వడం, ఇండ్లస్థలాలు కేటా యించడం, కులాలవారీగా కుంప్పట్లు పెట్టి రిజ ర్వేషన్ల పేరిట ప్రలోభాలుతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఆడుతున్న నాటకమే. దళితుల్ని చీల్చి, ఆయా రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టిస్తున్న దళిత నాయకులే దళితు లకు ద్రోహం చేస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు చెందిన ఓట్ల, సీట్ల వ్యవ హారం. దళిత నాయకత్వం చేస్తున్న ఈ దళారీ వ్యవహారాలే ఇన్నాళ్లుగా దళితుల్ని వెనకబాటుతనంలో అట్టిపె ట్టాయి. వాస్తవానికి తాత్కాలిక లో భాలకు కక్కుర్తి పడుతున్న నాయ కులు వల్ల దళిత జాతి సమాజంలో ఇంకా వివక్షతను పెంచిపోషిస్తు న్నరు, దీనిలో ఇరుక్కున్న దళితులో మేధావి వర్గంలో కొంతమంది నిస్వా ర్ధంగా జాతి ప్రయోజనం కోసం కృషి చేస్తు న్నారు, మరి కొంతమంది తమ స్వార్ధ ప్రయోజ నల కోసం దళిత నాయకత్వంలో ఆయా రాజ కీయ పార్టీలకు అమ్ముడుబోయి స్వప్రయోజ నాల అనుభవించడం చూస్తూనే వున్నాం. ఐక్యత లోపించట వల్ల దళిత సమస్యలు మీద చిత్తశుద్ధి కరువైంది, దళితుల ఆత్మగౌరవం తాకట్టుపెట్టి పబ్బం గడుపుతు న్నారు, అధికారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నారు. అధికారంలో లేనివారు, ఎన్నికలకై ఎదు రుచూస్తున్నారు. వాస్తవాలు గ్రహించి దళితులు జాతి ప్రయోజనాల కోసం మేలుకోవాలి.
దళితులది ఆర్థిక సమస్య మాత్రమే కాదు. కేవలం ఆర్థిక బాధ తీరితే, నేటికి అంటరాని తనం పోయి సమానత్వం రాదనేది తేలిపోయిం ది. డబ్బున్న దళితులు సైతం అంటరాని తనం సమస్యకు గ్రామాల్లో గురౌతూనే వున్నారు, దళి తులు ఉన్నత హోదాలో ఉన్న అధికారులకు కూ డా దళిత ఆఫీసర్‌ అన్ని బహిరంగంగా పేపర్‌ లో వార్తలు ఆఫీసులో పిలుస్తున్నారు, మరి ఇది ముమ్మాటికి వివక్ష? అవమానం దళితులు ఆత్మగౌరవమెక్కడీ సామాజిక ఆర్థికంతో కొలిచే తప్పుడు సిద్ధాంతం వలనే. దళితుల సమస్యలు దీర్ఘకాలికాలు, తాత్కాలికాలు అని రెండుగా చూ డాలి. తాత్కాలికమైన వాటిని రాజకీయ పార్టీలు, తీర్చడానికి ప్రయత్నిస్తూ, ఆకర్షిస్తు న్నాయి. నిత్యం ఇదే తడుముతూ ఉద్యోగాలు రిజర్వేషన్లు విద్య వైద్యం కనీసం మాలిక వస తులు సరైన ప్రణాళిక కార్యచరణం లేకపోవడం వల్ల ఆశిం చిన స్థాయిలో దళితుల అభివృద్ధి నోచుకోలేదు. ఈ దేశంలో కేవలం దళితులపైన వివక్ష ఎందుకు? గత కొన్నేండ్లుగా కోట్లాది ప్రజాధనం ఖర్చయిన, అణచివేతకు అంటరాని తనానికి అవమానానికి అన్యాయా నికి వివక్షకు నిత్యం గురవుతు న్నారు, దళిత సాధికారత విష యంలో ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇప్పటికీ వారిని అభివృద్ధికి, అవకా శాలకు దూరం చేస్తోంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దళితులకు సరైన ప్రాధాన్యత దక్కనట్లయితే వారి బతుకులు మారేదెలా?
ప్రస్తుతం దళితుల జీవితంలో ఏలాంటి మార్పు జరగలేదు. అందుకే ఇప్పుడున్న పాల కులు దళిత కులాల ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రణాళిక కార్యచరణ మొదలు పెట్టాలి. కులాల మధ్య ఉన్న సామాజిక ఆర్థిక అంతరాలను తొలగించాలి, దళిత కులాల బడ్జెట్‌ కేటాయింపులో జనాభా ప్రాతిపదిక కేటాయింపులు జరగాలి. వారి అభివృద్ధి ఖర్చు చేయాలి. గత పాలకులు దళితుల పట్ల దారుణమా నిర్లక్ష్యాన్ని గురి చేసింది. న్యాయంగా రావలసిన వాటను దళితులు పొందలేకపో యారు. నిస్సహయులుగా మిగిలి పోయారు, నిత్యం ఐదేళ్లకొకసారి పాలకులు మారుతున్న దళితుల స్థితిగతులు ఆందోళన కలిగిస్తు న్నాయి మేధావులు విద్యావంతులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతగానో ఉంది? దళితుల్లో అత్యంత వెనుకబడి దళిత ఉపకులాలు ఒకప్పుడు పల్లెల్లో కులవృత్తులు చేసుకుంటూ, సంచార జీవనం చేస్తూ, కళారూపాలను ప్రదర్శిస్తూ పొట్టుపోసు కుని జీవించే దళిత ఉపకులాలను నేడు వారిని పట్టించుకునే నాధుడు లేక విలవిలలాడు తున్నాయి. ఈ రాష్ట్రంలో 59 దళిత కులాలు ఉండగా ఉప కులాలకు అభివృద్ధి, అధికారం అందని ద్రాక్షలే అయింది. కులాలకు కనీస గుర్తింపు లేదు. ఈ దళిత ఉపకులాలు నేటికి కూడా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ సమాజంలో దళితులలో ఇన్ని కులాలు ఉన్నా యన్న విషయం కూడా తెలియని పరిస్థితి సమాజంలో ఉంది. స్వాతంత్య్రానంతరం మన రాజకీయ వ్యవస్థగా ప్రజాస్వామ్యాన్ని ఎంచు కున్నాం. ప్రజాస్వామ్యం బలహీనులకు బలమైన వారికి సమానమైన అవకాశాన్ని ఇస్తుంది, కానీ బలహీనులైన దళితుల ఎలాంటి రాజకీయ సామాజిక అవకాశాలు రావడం లేదు, తర తరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ఏ ప్రభుత్వమైనా ప్రచారం లంకించుకుంటే అంతకన్నా మోసం ఉండ బోదు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే పాలకుల వైఫల్యమే కారణం.
తీగల
అశోక్‌ కుమార్‌
96666 34001

Spread the love