‘కులగణన ఆవశ్యకత’

'కులగణన ఆవశ్యకత'భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కులవ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణ యించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవ నశైలి ద్వారా సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించ బడుతుంది. భారత ప్రభుత్వం పార్ల మెంటులో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 3వేల కులాలు, 25వేల ఉప కులాలున్నాయి.నిజానికి దేశంలో పనిచేస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు. నాటి వేదకాల సమా జంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ,శూద్రులుగా నాలుగు వర్ణాలుగా విభ జించారు. ఆ వర్ణాల నుండే కులాలు ఏర్పడ్డాయని వాదన. క్రీ.పూ 1500లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు సామాజిక చారి త్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కులవ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872లో జనాభా లెక్కలు ప్రారంభం అయ్యాయి.సామాజిక-ఆర్థిక కులగణన-ూజుజజ మొట్టమొదట 1931లో నిర్వహించారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమా చారాన్ని సేకరించడం, లేమి సూచికలను గుర్తిం చడం లక్ష్యంగా పెట్టుకుంది.1941 లో కూడా కులగణన చేయాలనే అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించి సమాచారం సేకరించింది కానీ రెండో ప్రపంచయుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయట పెట్టలేకపోయింది. 1951 తర్వాత జాతీయ ఐక్యతను పెంపొందించడానికి కులగణన సేకరణ ను నిలిపివేయాలనీ అప్పటి ప్రభుత్వం నిర్ణయిం చింది.1951 నుండి 2011 వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతీ జనాభా గణనలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన సమా చారం సేకరించి ప్రచురించారు. దేశవ్యాప్తంగా బీసీలు 52 శాతం ఉన్నారన్న మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌ కూడా 1931 కులగణన ఆధారంగా చేసుకుని చేసినవే. రిజర్వేషన్లు 50శాతం దాట కూడదని నిబంధన దృష్టిలో ఉంచుకొని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను మండల్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.
నేషనల్‌ శాంపిల్‌ సర్వే 2011 -12 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. నేష నల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2016-17 ప్రకారం దేశంలో 28 శాతం ప్రజలు మల్టీ డైమెన్షనల్‌ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50శాతం, ఎస్సీలు 33 శాతం, ఓబీసీలు 27శాతం పేదరికంలో ఉన్నారు. 2017 -18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3 శాతం, ఎస్సీలు 4శాతం, ఓబీసీలు ఆరు శాతం జనరల్‌ క్యాటగిరి 12 శాతం గ్రాడ్యుయేట్స్‌ ఉన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌లో జనరల్‌ కేటగిరీలో మూడు శాతం ఓబీసీలో ఒకశాతం మాత్రమే ఉన్నారు. ఉపాధి రంగం జనరల్‌ కేటగిరిలో 30శాతం, ఓబీసీలో 20శాతం, ఎస్టీలు 12 శాతం మాత్రమే స్థిర మైన ఉద్యోగాలు పొందుతున్నారు.రోజువారి కూలీలు ఎస్టీలు 29 శాతం, ఎస్సీలు 38శాతం, ఓబీసీలు 20 శాతం జనరల్‌ కేట గిరీలో 11శాతం మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7శాతం మంది జనరల్‌ కేటగిరి చెందినవారే ఉన్నారు. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64శాతం పైగా జనరల్‌ కేట గిరీ వారు ఉన్నారు.ఈ గణాంకాలన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధి కారికంగా వెల్లడించినవే వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్‌ కేటగిరి వారితో పోల్చితే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడ్డారని అర్థమవుతుంది.
భారతీయ సమాజం సమగ్ర చిత్రాన్ని రూపొం దించాలన్న, సమాజంలో గల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అసమానతలు తగ్గించాలన్న, దేశంలో కుల నిర్మూలన చేయాలన్నా వనరుల సమాన పంపిణీ, పథకాల రూపకల్పనకు కులాల సమగ్ర సమాచారం అవసరం. 25 నవంబర్‌ 1949లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తన చివరి ఉపన్యాసంలో ‘ ప్రతి మనిషికి ఒక ఓటు ప్రతి ఓటుకు సమాన విలువ ఇవ్వడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించాం.సాంఘిక ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించాలి, భవిష్యత్తు పాల కులు అందుకు కృషి చేయాలి’ అని అన్నారు. సాంఘిక ఆర్థిక సమానత్వ కోసం కులగణన అవశ్యకం. భారత రాజ్యాంగం కూడా కుల గణనను నిర్వహించడాన్ని సమర్థిస్తోంది. ఆర్టికల్‌ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుక బడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్‌ను నియ మించాలని ఆదేశించింది.
2018లో పార్లమెంట్‌ సాక్షిగా అప్పటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారతదేశంలో రాబోయే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీ కులగణనను వ్యతి రేకిస్తోంది.2021లో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభు త్వం రాబోయే జనాభా గణాల్లో ఎస్సీ,ఎస్టీల గణన మాత్రమే చేస్తామని చేయమని స్పష్టం చేసింది. ఓబీసీల కులగణన చేయబోమని తేల్చిచెప్పింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, బీసీల రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. 2011లో యూపీఏ హయంలో కుల గణన కోసం ప్రణాళికలు తయారు చేసే నిధులు కూడా కేటా యించింది. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం) లు కులగణన మద్దతుగా తీర్మానాలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జగన్‌ మోహన్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి కులగణన చేస్తామని ప్రకటించారు.
బీహార్‌ రాష్ట్రం జనవరి 2023లో మొట్ట మొదట కుల గణన చేసి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల (63శాతం) మంది ”వెనుకబడిన” వర్గాలకు చెందిన వారున్నారని సర్వేలో తేలింది. కులగణన వల్ల సమాజంలో కులవ్యవస్థ బలోపేతమవుతుందని, కులాల వారిగా ప్రజలను వర్గీకరించడం అంటే వ్యక్తి గత హక్కులు హరించడమేనని, కులాలను నిర్వచించడం కష్టమని, ఇది సమాజంలో గందర గోళం, వివాదాలకు దారి తీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన కూడా ఉంది. కులగణనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు ఉన్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించ డానికి, వనరుల సమాన పంపిణీని నిర్ధారిం చడానికి వెనుక బడిన కులాల జనాభా సమాచారం అవసరం. సమగ్ర కులాల సమాచారం సామాజిక అసమానతలను పరిష్కరించడంలో, సమానత్వ సమాజాన్ని రూపొందించడంలో సహాయ పడుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులాల వివరాలు సేకరిం చింది. దీనికి చట్టబద్ధత లేకపో వడంతో న్యాయ స్థానంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనపై చట్టం చేసి సర్వే ప్రారంభించాలి. కుల గణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటిం చింది అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం హర్షనీయం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సమా చారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలకు పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉన్నదన్న సంగతి మరవకూడదు.
పాకాల శంకర్‌గౌడ్‌ 9848377734

Spread the love