అరకొర నిధులతో ఆశలు నెరవేరేనా!?

Can hopes come true with limited funds!?తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలు వు తీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేని ఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో కచ్చితంగా నెరవేర్చి తీరు తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇంకా కొన్ని రోజులే ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వీటిని అమలు చేయడం కష్ట మేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే పట్టణ ప్రగతిని కాస్త పక్కన పెట్టి గ్రామీణ వికాసానికి కొంత ఊరట కలిగించినట్లు కనబడుతోంది. జాబ్‌ కేలండర్‌ ప్రకటన నిరుద్యో గుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పటిష్టమైన ఐటీ విధానం తెస్తామనడం వల్ల కొంతమేరకు మార్పులచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావి స్తున్నారు. వైద్యఆరోగ్య శాఖకు మొత్తం మీద తగ్గింపు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పథకంలో కొంత పెరుగుదల ఊరట కలిగిస్తున్నది. ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టం లేకుండా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతి పాదించడం కొంత చర్చనీయాంశంగా మారింది.
ఆరు గ్యారంటీలకు, గ్రామీణ వికాసానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ ప్రతిపాదన కనబడుతోంది. బడ్జెట్‌లో ఈ రెండింటి వాటా సుమారు మూడో వంతు ఉండడం గమనార్హం. ఆరు గ్యారంటీల అమలుకు కనీసం రూ.80 వేల కోట్లు అవసరం పడుతుండగా కేవలం రూ.53,196 కోట్లనే ప్రతి పాదించడం ఆలోచించాల్సిన అంశం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఏటా రూ.ఆరు కోట్లు, రూ.500కి గ్యాస్‌ సిలిండర్‌ అందించడానికి రూ. 2,923 కోట్ల సబ్సిడీ అవసరం పడుతుంది. కాగా ఆర్టీసీ జీరో టికెట్‌ కోసం నెలకు రూ.300 కోట్లు కేటాయింపు చేయడం కొంత ఊరట కలిగిస్తున్నది. కాగా రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏటా రూ.15వేల చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చుటకు కనీసం రూ.29 వేల కోట్లు కేటాయించవలసిన అవసరమైతే ఉన్నది.
ఇందిరమ్మ ఇండ్లను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు కావలసిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వ లేదు. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్ప టికీ కేటాయింపు మాత్రం కేవలం రూ. 7,740 కోట్లు ప్రతిపాదించింది. కానీ వాస్త వానికి రూ.15 వేల కోట్లు ఇస్తేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని ఒక అంచనా. విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు గాను యువ వికా సానికి రూ.10వేల కోట్లు అవసరం అవుతాయి. అలా చూస్తే గృహజ్యోతికి రూ.4,164కోట్లు, చే యూతకు రూ.21వేల కోట్లు అవసరం పడను న్నాయి. వీటన్నింటికీ సరిపడా నిధులను కేటా యిం చకపోవడం వల్ల పూర్తిస్థాయి అమలు ప్రశ్నార్థక మేనని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ వికాసానికి రూ.40,080 కోట్లు కేటాయించడం శుభ పరిణామం. గతంతో పోలిస్తే విద్యకు 1.05 శాతం అదనంగా కేటాయింపులు కొంత ఊరట కలిగిస్తున్నది. కానీ వైద్య ఆరోగ ్యశాఖలో రూ.661కోట్లు తగ్గుదల కొంత నిరాశ కలిగిస్తున్నది. ఆరోగ్యశ్రీకి అయ్యే వ్యయాన్ని పెం చడం కొంత ఆశాజనక పరిణామం. పట్టణాల అభి వృద్ధికి బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులే జరిగాయి. 129 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీత భత్యాలు, నిర్వహణ వ్యయాల కింద రూ.11,692 కోట్లు మాత్రమే కేటాయించడం నిరాశే. తాజా బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సంక్షే మం వైపు కొంత మొగ్గు చూపినట్లు కనపడుతోంది. సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.45,149 కోట్లు కేటా యించడం దీనికి నిదర్శ నం. కాకపోతే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు కేటాయింపులు ప్రత్యేకంగా లేకపోవడం చూస్తే వాటికయ్యే వ్యయాన్ని సంక్షేమ శాఖల నిధుల నుంచే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
బడ్జెట్‌ను సమగ్రంగా పరిశీలిస్తే పన్ను ఆదా యం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా కనబడు తుంది. రెవెన్యూ రాబడులు రూ. 2 లక్షల పైచి లుకు, మూలధన రాబడులు రూ.68,585 కోట్లుగా పేర్కొనడం, ఆశల పల్లకిలో ఊరేగడమే. స్థూలంగా రెవెన్యూ రాబడులను రాబట్టడానికి పన్ను వడ్డింపు భారీగా ఉండడం ఖాయమని అంచనాకు రావచ్చు. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం తగ్గడం కొంత వాస్తవ రూపాన్ని సంతరించుకుందని చెప్ప వచ్చు. రాష్ట్ర వృద్ధిరేటు 14.7శాతంనుంచి 11.3 శాతానికి క్షీణించింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూ డా తగ్గింది. గతంతో పోలిస్తే ద్రవ్యలోటు అంచనా కు మించి పెంచబడింది. జిఎస్డిపిలో 3.5శాతం చూపెట్టడంతో ఈ మేరకు ద్రవ్యలోటు కనబడుతుం దని ఆర్థిక నిపుణుల అంచనా. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే పన్నుల్లో వాటాను పెంచడం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను తగ్గించినట్టు సమాచారం. గత బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాల కంటే ఏకంగా 50శాతం ఎక్కువగా ఈసారి అప్పుల పద్దు చూప డం, రుణ సమీకరణ మొత్తం బడ్జెట్లో 25శాతం కావడం గమనార్హం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కొండంత ఆశ లు రేకెత్తించి గోరంత అమలు కూడా లేని విధంగా మారిపోయిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుండగా, ఇది వాస్తవానికి దగ్గరి బడ్జెట్‌ అని, సంక్షేమానికి పెద్దపీట వేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాంగ్రెస్‌ చెబుతోంది. వాదోపవాదనలు ఎలా ఉన్నా కేటాయించిన బడ్జెట్‌ పేదల బతుకులు మార్చేలా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
భాస్కర్‌ యలకుంటి 8919464488

Spread the love