వేద కాలం

వేద కాలం1. వేదం అంటే జ్ఞానం అని అర్థం (విద్‌ అంటే గ్రహించడం అని అర్థం.
2. వేదాలను బ్రాహ్మణులు కేవలం మౌఖికంగా పలుకుతూ శతాబ్ధాల తరబడి నిక్షిప్తం చేశారు.
3. వేదాలకు గుప్తుల కాలంలో వ్రాత రూపం కల్పించి వుండవచ్చును.
4. క్రీ.పూ 1800 సంవత్సరాల తరువాత సింధూనది వరదల వలన లేదా ఆర్యులు దండయాత్రల వలన హరప్పా సంస్కృతి వారి నగరాలు నశించి వుండవచ్చని చరిత్ర కారులు అభిప్రాయ పడుతున్నారు.
5. క్రీ.పూ 2000-1500 మధ్యకాలంలో ఆర్యులు భారతదేశం చేరారు.
6. మొదట ఆర్యులు పంజాబ్‌, సింధు ప్రాంతాలలో స్థిరపడ్డారు.
7. ఆర్యులు సింధు ప్రజలను దస్యులు గా పిలిచారు.
8. శబ్ధ పరంగా ఆర్యన్‌ అంటే ఉత్తమ జన్మ అని అర్థం.
9. ఆర్యన్‌ అనే పదం భాష, జాతిని రెండింటినీ సూచిస్తుంది.
10. ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారకం ఆర్యుల జన్మభూమి మధ్య ఆసియా.
11. బాలగంగాధర్‌ తిలక్‌ అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్‌ ప్రాంతం వారు.
12. నిుష్ట్రవ Aతీషఱ్‌ఱష ష్ట్రశీఎవ ఱఅ Vవసష్ట్రaరు గ్రంథ రచయిత బాలగంగాధర్‌ తిలక్‌.
13. గంగా యమునా అంతర్వేదిలో విలసిల్లిన పెయింటెడ్‌ గ్రేవర్‌ సంస్కృతికి నిర్మాతలు – ఆర్యులు.
14. స్వామి దయానంత సరస్వతి ప్రకారం ఆర్యుల జన్మస్థానం – టిబెట్‌
15. ఆర్యులు భాషా – సంస్కృతి (నేడు ఉత్తర భారత దేశంలో హిందీ, పంజాబీ, బెంగాలీ మొదలైన చాలా భాషలు సంస్కృతం నుంచి పుట్టాయి అందుకే వాటిని ఆర్య భాషలు అంటారు.)
16. భారత మరియు ఐరోపా సమ్మిళితం అయిన భాషలో లభించిన మొట్టమొదటి ప్రతి – ఋగ్వేదం.
17. ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డాక వారు కూర్చిన గ్రంథాలు – వేదాలు.
18. వేదాలు 4 అవి
1.ఋగ్వేదం
2. సామవేదం
3. యజుర్వేదం
4. అదర్వణ వేదం
19. వేదాలలో మొదటిది మరియు పురాతనమైనది – ఋగ్వేేదం
20.ఋగ్వేద కాలాన్ని తొలి వేద కాలం (1600-1000) అంటారు.
21. ఋగ్వేదాన్ని క్రీ.పూ 1500-1000 మధ్య వెలువరించారు.
22. ఋగ్వేదంలోని సంస్కృత భాష జెంద్‌ అవెస్తా లోని పాత పర్షియన్‌ భాషకు దగ్గరగా వుంటుంది.
23. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆదారం – ఋగ్వేదం.
24. జన (తెగ)ను ‘విష్‌’లుగా విభజించారు. ఈ పదం ఋగ్వేదంలో ‘171’ సార్లు వస్తుంది.
25. విష్‌లను ‘గ్రామాలుగా’ విభజించారు.
26. ఋగ్వేద కాలంలో స్త్రీలు సభా, విధాత లకు హాజరయ్యే వారు.
27. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో కలదు.
28. వడ్డీ వ్యాపారం రుగ్వేద కాలం నుంచి కలదు.
29. ఋగ్వేద కాలంలో సేవించే పానియం – సోమపానం
30. ఋగ్వేద కాలం నాటి బంగారు నాణెం – నిష్క
31. విశ్వ జననం గురించి రేగ్వేదంలో 10వ మండలంలో కలదు.
32. ఋగ్వేద కాలం నాటి ఆర్యులకు చదవడం, రాయడం రాదు.
33. ఋగ్వేదంలో ఆర్యులు దాస్యులు (ఆర్వేతరులు) మధ్య తేడా తెలుపుతూ రంగును వివరిస్తూ వర్ణ అనే పదాన్ని వాడారు.
34. నిరూక్తమును రాసింది – యస్కుడు.
35. వ్యాకరణ శాస్త్రాన్ని రాసింది – పాణిని
36. చందోవిచితిని రాసింది – పింగళుడు.
37. ఋగ్వేద కాలంలో రాజునకు ప్రజలు చెల్లించే రక్షణ సుంఖం – బలి.
38. వేదాంగాలు 6 ఇవి సూత్రాల రూపంలో వుంటాయి.
39. ప్రాచీన కాలంలో ధర్మ సూత్రాలు మనుధర్మ శాస్త్రం పై ఆధారపడి వుండేవి.
40. వేదాంగాలలో ఒకటైన కల్ప సూత్రాలను అనుసరించి మనుధర్మ శాస్త్రం రాయబడింది.
41. ఆర్యులు ఇరాక్‌లో వేసిన శాసనాలు బోగజ్‌కై అనే చోట ‘కస్పెటి’ ‘మిటాని’ శాసనాలు.
42. ఆర్యుల కాలంలో రాజరికం తెగలకు సంబంధించిన వ్యవస్థ రాజు తెగలకు అధిపతి. రాజన్‌ అని పిలిచేవారు.
43. తెగలను ‘జన’ అని పిలిచేవారు.
44. ఋగ్వేదంలో జన గురించి ‘275 సార్లు’ ప్రస్తావన కలదు. కాని జనపదాల గురించి ప్రస్థావన లేదు. రాజ్యం గురించి ఒకసారి మాత్రమే ప్రస్థావించారు.
45. రాజుకు సహాయ పడేందుకు సభా, సమితి అనే ప్రజా సభలు వుండేవి.
46. రాజు పరిపాలనకు ముఖ్య సహాయకారి – పురోహితుడు లేదా చాప్లాయిన్‌
47. ఋగ్వేద కాలంలో ఏనుగులను యుద్ధాలకు వాడలేదు.
48. ఋగ్వేదంలో సరస్వతి నదికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
49. సరస్వతి నది కొత్త పేరు షుగర్‌ లేదా చితాంగ్‌
(ఋగ్వేదంలో పాత పేరు సరస్వతి)
50. ఆర్యులు ప్రధానంగా 2 రకాల యుద్ధాలు చేసేవారు.
1. ఆర్యులు కంటే ముందు వారితో యుద్ధం చేసేవారు.
2. వారిలో వారే యుద్ధం చేసుకొనేవారు.
51. ఆర్యులు ప్రధానంగా 2 వర్గాలుగా వుండేవారు.
ఒక వర్గం శ్రీనజాయులు, భరతులు
2వ వర్గం యూదులు, తుర్వాసులు, ద్రుహియులు, పురులు వుండేవారు.
52. రావి జలాలు పంపిణీ విషయమై ఇరు వర్గాలుకు రావి నది ఒడ్డున యుద్దం జరిగింది. (రావి ప్రరుష్ని)
53. ఈ యుద్ధంలో భరతులు అనే తెగ ఇతర 10 తెగలతో యుద్ధం చేసి సూడస్‌ నాయకత్వంలో భరతులు యుద్ధంలో గెలిచారు.
54. పై యుద్ధంను ధశరాజ్ఞ లేదా పది మంది రాజులు యుద్ధం అని ఋగ్వేదంలో వివరించబడింది.
55. పై యుద్ధంలో గెలిచిన భరతులు పేరు మీదనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. యుద్ధ విజేత సుదాముడు.
56. ఋగ్వేదం ప్రకారం ఆర్యులు మొట్టమొదట భారతదేశంలో సప్త నదులు ప్రాంతం (సప్త సింధు)లో నివాసం ఏర్పరచుకొన్నారు.
57. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పశుసంపద, వ్యవసాయంపై ఆధారపడేవారు.
58. ఋగ్వేదం మొదటి భాగంలో నాగలి గురించి ప్రస్తావన వుంది.
59. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ప్రదాన ఆహారం యువలు (బార్లీ)
60. ఋగ్వేద కాలంలో ప్రధాన ఆస్తి – పశుసంపద
61. ఋగ్వేదంలో ఆవుల గురించి ప్రస్తావన 176 సార్లు వస్తుంది.
62. ఋగ్వేద కాలంలో ప్రధానంగా యుద్ధాలు ఆవుల గురించి జరిగేవి. ఈ యుద్ధాలను గవిస్తి అనేవారు.
(గవిస్తి అంటే ఆవుల కోసం వెదకడం అని అర్థం)
63. దాహితి అంటే ఆవుపాలు పితికేది మరియు కూతురు అని అర్థం.
64. అఘన్య అంటే గోవులను చంపరాదని అర్థం.
65. గోఘన అంటే గోవులను చంపేవాడని అర్థం.
66. ఆయస్‌ అంటే రాగి లేదా కంచు అనే అర్థం వస్తుంది.
67. ఋగ్వేద కాలంలో ఆర్యులు వాణిజ్యం చేసేవారు కాదు దీనికి తగిన ఆధారాలు లేవు.
68. రుగ్వేద ప్రజలకు సముద్రం గురించి తెలియదు. వీరికి సముద్రం అంటే జలాశయం అని మాత్రమే తెలుసు.
69. ఋగ్వేద కాలం నాటి పన్నులు – బలి, బాగ, సుల్క
70. ఋగ్వేద కాలం నాటి ఆర్యు రుషులు – విశ్వామిత్ర, వశిష్ఠ
71. ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞలు – లగుదుడు, గర్గుడు.
72. ఋగ్వేద కాలం నాటి ప్రజాభీప్రాయ సంస్థలు – 4
సభ, సమితి, గణ, విధాన (పురాతన గిరిజన అసెంబ్లి)
73. ఋగ్వేదంలో వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తంలో మొదటిసారిగా కన్పిస్తుంది.
74. ఆర్యుల (తొలివేదకాలం)కు గుర్రం ఉపయోగించడం తెలుసు.
75. దశ రాజుల యుద్ధంలో భరతుని పక్కన ఉన్న రుషి – విశ్వా మిత్రుడు.
76. ఋగ్వేదంలో 10వ మండలంలో మొదటిసారిగా ‘శూద్రా’ అనే పదం కన్పిస్తుంది.
77. వేదకాలంలో మొదటిగా ఇనుమును ఉపయోగించిన ప్రాంతం – గాంధార
78. ఋగ్వేద కాలంలో దేవాలయాలు, విగ్రహారాధనలు లేవు.
79. తొలి వేద కాలంలో సమాజంలో సభ్యులందరికీ సంపదను పంపిణీ చేసే సభ – గణ.
80. యుద్ధంలో పాల్గొన్న 10 తెగలలో ‘పురు’ వంశస్థులు ముఖ్యమైన వారు. వీరు భరతులతో కలిపి ‘కురువులు’గా అవతరించారు.
81. ఈ కురువంశంలోని పాండవులు, కౌరవుల మధ్య యుద్ధమే మహాభారత యుద్ధం (కీ.పూ.950)
82. ఆర్యుల కుటుంబ వ్యవస్థ – పితృస్వామ్య వ్యవస్థ.
83. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఇంద్రుడిని కీర్తిస్తూ 250 శ్లోకాలు వున్నాయి.
84. ఋగ్వేదంలో వర్ణించిన స్త్రీ దేవతలు – అదితి, ఉషస్‌.
85. సామవేదంలో 1603 శ్లోకాలు వున్నాయి. భారతీయ సంగీత మూల బీజాలు సామవేదంలో కన్పిస్తాయి.
86. యజ్ఞులు నియమ నిబంధనలు, ప్రకృతిని వశపర్చుకోవడం లాంటి విషయాలు యజుర్వేదంలో కలవు.
87. రోగాలు నయం చేయడం దుష్ట శక్తులను పారద్రోలడంకు అవసరమగు మంత్ర తంత్రాలు అదర్వణ వేదంలో కలవు. (ఇది ఆర్యులది కాదనే వాదన వుంది)
88. ఉపనిషత్తులు 108 కలవు.
89. వేద సాహిత్యాన్ని శృతి అని వేదాంగాలను స్మృతి అని అంటారు.
90. ఋగ్వేదంలో మొత్తం మంత్రాలు – 1071
91. ఋగ్వేద కాలం నాటి ప్రసిద్ధ కవయిత్రులు – గార్గి, లోపముద్ర
92. వస్తు మార్పిడి పద్ధతిలో ఆర్యులు వాడిన సాధనాలు – బంగారము, ఆవు.
93. ఆర్యుల ప్రధాన వినోద కాలక్షేపం – రధపు పందేలు.
94. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రధానంగా రుగ్వేదంలో కలదు.
95. వేదకాలంలో గ్రామాధికారిని గ్రామిణి అనేవారు.
96. వేదకాంలో కులపెద్దను కులాపా అనేవారు.
97. ఋగ్వేద కాలంలో వాణిజ్యం ఫణి అనే అనార్యజాతి చేసేవారు.
98. ఆర్యుల నాణాలు – నిష్క, శతమాన, సువర్ణ, కార్ష, పణ
99. ఆర్యుల వంశం – నార్టిక్‌ జాతి.
100. ఆర్యుల కాలంలో ప్రయాణ సాధనాలు – ఎడ్ల బళ్ళు, రధాలు
101. ఆర్యుల కాలంలో శిక్షా విధానం – దేశ బహిష్కరణ, అంగ విచ్చేధనం.
102. ఆర్య భాష అయిన సంస్కృతంలో సుమారు 450 ద్రావిడ పదాలు కలవు.
103. ఋగ్వేదంలోని 10 భాగాలలో 2 నుంచి 7 వరకు ప్రాచీనమైనవి.
104. తొలివేద కాలం చివరి దశలో ఏర్పడ్డ వర్ణం – శూద్రులు.
105. వేద కాలం నాటి ‘సూప శాస్త్రం’ వంటలకు సంబంధించినది.
106. వేదకాలంలో దాన్యాన్ని వ్రిహి అని పిలిచేవారు.
107. ఋగ్వేదంలో 9వ మండలం పూర్తిగా సోమ దేవుడు గురించి కలదు. ‘సోమ’ అనగా ఒక వృక్షం నుంచి వచ్చే పానీయం. తరువాత కాలంలో చంద్రుడిగా, వృక్షాలకు రాజుగా గుర్తించారు.
108. ఋగ్వేదంలో 259 శ్లోకాలు ఇంద్రుడు గూర్చి కలవు. ఇతడు యుద్ధ దేవత (ఆయుధం – వజ్రాయుధం)
109. ఋగ్వేదంలో 200 శ్లోకాలు అగ్ని దేవుడు గూర్చి కలవు. ఇతడు దేవతలకు మానవులకు మధ్య వారధి.
110. ఋగ్వేద కాలంలో భూములపై అధికారం కల అధికారి – ప్రజాపతి.
111. ఋగ్వేద కాలంలో వివాదాలు పరిష్కరించే అధికారి – మధ్యయస్తి.
112. ఋగ్వేదంను తెల్పినది హోత్రి అనే పురోహితుడు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love