రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు

నవతెలంగాణ- ఆళ్ళపల్లి: చేను పనికి ట్రాక్టర్ పై వెళ్తున్న గిరిజన మహిళ, గొత్తికోయ యువతికి తీవ్ర గాయాలైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముత్తాపురం గ్రామానికి చెందిన పాయం స్వరూప సొంత చేను పనికి కూలీకి అదే గ్రామంలోని బాసోల్ల గుంపుకు చెందిన మడకం దేవిని తీసుకుని ట్రాక్టర్ పై కూర్చుని వెళ్తున్న క్రమంలో మార్శెల వాగు మూల మలుపు వద్ద పట్టు తప్పడంతో ట్రాక్టర్ పై నుంచి స్వరూప, దేవి రోడ్డు పై పడ్డారు. ఈ ప్రమాదంలో మడకం దేవి తలకు, మెడ, బుజం భాగంలో.. పాయం స్వరూప కాలు విరిగి, తలకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు అర్వపల్లి రేవంత్ తెలిపారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి వైద్యాధికారి రిఫర్ చేశారు.
Spread the love