తల్లి మందలించడంతో బాలుడు మృతి..

నవతెలంగాణ – కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని, వట్టిమల్ల గ్రామంలో గల కమ్మారిపెట తండాలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మరిపెట తండాకు చెందిన బానోవత్ రాజు-జ్యోతి దంపతుల కుమారుడు దినేష్ (17) జల్సాలకు అలవాటుపడి పక్కదారి పడుతున్నాడు అని అవేదన చెందిన తల్లి, దినేష్ నీ మందలించడంతో మనోవేదనకు గురైన బాలుడు గురువారం ఊదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి అటవీ ప్రాంతానికి వెళ్లి,ఫోన్ లో సెల్ఫివీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్న అని చెప్పి ,అదే గ్రామానికి చెందిన తన మిత్రుడి ఫోన్ కి వీడియో పంప్పి సూసైడ్ చేసుకున్నాడు.ఆ వీడియో చూసిన కుటుంబ సభ్యులు దినేష్ కోసం గాలించగా శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఊరి వేసుకొని కనిపించాడు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఐ రమాకాంత్ మృతదేహాన్ని నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి తరలించారు. దినేష్ మృతితో కమ్మరిపెటా తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Spread the love